2019 వైరల్ వీడియోలు : మనిషి పోలిన చేప, కుక్కపై మొసలి దాడి!

  • Published By: sreehari ,Published On : December 21, 2019 / 11:08 AM IST
2019 వైరల్ వీడియోలు : మనిషి పోలిన చేప, కుక్కపై మొసలి దాడి!

2019 ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని వైరల్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. వడోదరలో రోడ్డుపై వరదనీటిలో కుక్కపై మొసలి దాడి వీడియో నుంచి చైనాలో మనిషి ముఖంతో చేప ఈదడం వంటి ఎన్నో స్కేరింగ్ వీడియోలు ట్రెండ్ అయ్యాయి.

ఇలాంటి రకమైన వీడియోలను చూడగానే ఒక్కసారిగా వామ్మో అనిపించడం కామన్ కదా.. అతికొద్ది రోజుల్లో 2019 ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్నాం. ఇలాంటి సమయంలో ఈ ఏడాదిలో నెట్టింట్లో వైరల్ అయిన కొన్ని జంతువుల వీడియోలను ఓసారి చూసేద్దాం.

వడోదరలో కుక్కపై మొసలి దాడి :
గుజరాత్ లోని వడోదరలో గత ఆగస్టు నెలలో భారీ వర్షాలతో నగర రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీళ్లు వీధుల్లోకి నిలవడంతో జనజీవనం స్తంభించింది. సిటీకి సమీపంలోనే నది ఉండటంతో అందులోని మొసళ్లు రోడ్లపైకి వచ్చాయి. అదే సమయంలో కుక్కపై మొసలి దాడి చేసింది. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. 
dog croc

చైనాలో మనిషి ముఖంతో చేప ఈత :
ఇదో మిస్టరీస్ వీడియో.. నిజంగా ఇలాంటి చేపలు ఉంటాయో అని ప్రతిఒక్కరికి అనుమానం రాకమానదు. అచ్చం మనిషి ముఖం మాదిరిగా ఉన్న ఓ చేప నీటిలో ఈదుతూ కనిపించింది. చైనీస్ గ్రామంలోని ఓ చెరువులో ఈ దృశ్యం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చేప ముఖంలో ముక్కు, రెండు కళ్లు, నోరు అన్నీ అచ్చం మనిషి మాదిరిగానే ఉన్నాయి. ఈ వీడియో కూడా బాగానే ట్రెండ్ అయింది. 

ఇంట్లోకి చిరుత.. కుక్కపై దాడి :
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. అక్కడి కుక్కపై దాడి చేసింది. నాసిక్ లో ఈ ఘటన జరిగింది. పార్కింగ్ చేసిన ప్రాంతంలో కుక్క నిద్రిస్తుండగా మెల్లగా అక్కడికి వచ్చిన చిరుత దాడికి యత్నించింది. అదృష్టవశాత్తూ ఆ కుక్క తృటిలో తప్పించుకుంది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. 

జింకపై ఎగిరి దాడి చేసిన కొండచిలువ :
ఈ ఏడాది నవంబర్ నెలలో మహారాష్ట్రలో వీడియో వైరల్ అయింది. నీళ్లు తాగేందుకు కొలను దగ్గరకు వచ్చిన జింకల్లో ఒకదాన్ని భారీ కొండచిలువ ఎగిరి ఒడిసిపట్టి దాడి చేసింది. ఒళ్లు జలజరించేలా ఉన్న వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయింది. 

కొండచిలువ.. అలిగేటర్ మధ్య పోరు
ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో జూలైలో వైరల్ అయింది. మడుగు నీటిలో ఉన్న 11 అడుగుల అమెరికన్ అలిగేటర్ ఓ భారీ కొండచిలువను అమాంతం నోట కరిచి చంపేసింది. కొండచిలువకు మొసలికి మధ్య జరిగిన భీకర పోరులో మొసలినే విజయం వరించింది. ఈ వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. 
croc