ఏప్రిల్ ఫూల్ ప్రాంక్స్ బ్యాన్ చేసిన మైక్రోసాఫ్ట్

ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు.. అందర్నీ ఫూల్స్ చేద్దామనే ఉబలాటం, ఆరాటం ఉంటుంది. అబద్దాలను నిజంగా చెబుతూ ఆటపట్టిస్తుంటారు.

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 05:36 AM IST
ఏప్రిల్ ఫూల్ ప్రాంక్స్ బ్యాన్ చేసిన మైక్రోసాఫ్ట్

ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు.. అందర్నీ ఫూల్స్ చేద్దామనే ఉబలాటం, ఆరాటం ఉంటుంది. అబద్దాలను నిజంగా చెబుతూ ఆటపట్టిస్తుంటారు.

ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు.. అందర్నీ ఫూల్స్ చేద్దామనే ఉబలాటం, ఆరాటం ఉంటుంది. అబద్దాలను నిజంగా చెబుతూ ఆటపట్టిస్తుంటారు. ఇది కొన్నిసార్లు వివాదాలు, విషాధాలకు దారి తీస్తోంది. ఇలాంటిదే మైక్రోసాఫ్ట్ ఆఫీసులో జరిగింది. కంపెనీలు ఉద్యోగులు చేసిన ఏప్రిల్ ఫూల్ ఫ్రాంక్.. ఓ ఉద్యోగి మరణానికి కారణం అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తుల విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో కంపెనీ స్పందించింది. ఏప్రిల్ ఫూల్ డే ప్రాంక్స్ చేసినా, ఫూల్స్ మెసేజ్‌లు, కామెంట్లు, ఇతర మార్గాల్లో ఎవరైనా సరే ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. 
Read Also : గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

ప్రపంచ వ్యాప్తంగా అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీసుల్లో వీటిని రద్దు చేసింది. అలాంటి చర్యలకు ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించింది. కంపెనీలోనే కాదు.. బయట కూడా పద్దతిగా ఉండాలని సూచనలు చేసింది. ఏప్రిల్ ఫూల్ డే కాదని.. అలాంటి ఆలోచన కూడా చేయొద్దని సూచించింది మైక్రోసాఫ్ట్. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ మార్కెటింగ్ చీఫ్ ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియచేశారు. ఆ రోజున నష్టాలే తప్ప లాభాలుండవని తెలిపారు. 

మైక్రోసాప్ట్ ఈ విధంగా చేయడం మొదటిసారి. ఏప్రిల్ పూల్స్ ప్రాంక్‌ ఎన్నోసార్లు నిర్వహించారు. 2015లో విండోస్ పోన్ MS-DOS మొబైల్ యాప్ పేరిట ఏప్రిల్ పూల్స్ ప్రాంక్ చేశారు. 2013 సంవత్సరంలో గూగుల్, మైక్రోసాప్ట్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. 
Read Also : హిజ్రాలే టార్గెట్: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌