Shashi Tharoor: ఏడున్నరేళ్ల తర్వాత శశి థరూర్‌కి ఊరట

కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి శశి థరూర్‌పై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Shashi Tharoor: ఏడున్నరేళ్ల తర్వాత శశి థరూర్‌కి ఊరట

Sashi Taroor

“Years Of Torture”: కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి శశి థరూర్‌పై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశి థరూర్‌కు పెద్ద ఊరట లభించింది. శశి థరూర్‌పై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

చార్జిషీట్‌లో సరైన ఆధారాలు లేవంటూ శశిథరూర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఏడున్నరేళ్ల పాటు తనను వేధించిన కేసులో చివరకు ఊరట లభించింది. సుంనంద పుష్కర్ 2014, జనవరి 17న అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో సునంద చనిపోగా.. ఈ కేసులో ఆమె భర్త శశి థరూర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదని.. శశిథరూరే చంపేశారని ఆమె తల్లిదండ్రులు కూడా ఆరోపించారు.

ఈ క్రమంలోనే సునంద పుష్కర్‌ను ఆమె భర్త మానసిక వేధింపులకు గురిచేశారని, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఢిల్లీ పోలీసులు అభియోగించారు. వరకట్నం కోసం వేధించారంటూ. అందువల్లే ఆత్మహత్య చేసుకుని సునంద చనిపోయినట్లుగా అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ పేరు ప్రధానంగా వినిపించింది. ఆమెతో స్నేహం తర్వాతే భార్యను చనిపోయేలా ప్రభావితం చేశారని శశిధరూర్‌పై ఆరోపణలు వచ్చాయి. లేటెస్ట్‌గా శశిథరూర్‌ని అన్నీ ఆరోపణల నుంచి తొలిగించింది కోర్టు.