యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ రూ.2800 కోట్ల ఆస్తులు జప్తు

  • Published By: bheemraj ,Published On : July 10, 2020 / 01:53 AM IST
యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ రూ.2800 కోట్ల ఆస్తులు జప్తు

యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్‌ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కపూర్‌తోపాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌, ధీరజ్‌ వాధవాన్‌లకు చెందిన ఆస్తులను ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

వీటిలో ముంబై, లండన్‌, అమెరికాలో కపూర్‌కు ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ముంబై, పుణె, లండన్‌, ఆస్ట్రేలియాలో దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రమోటైర్లెన కపిల్‌ వాదావాన్‌, ధీరజ్‌ వాదావాన్‌ల రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ల మధ్య క్రిడ్‌క్రో ప్రో జరిగిందని సీబీఐ ఆరోపించింది. వీరిపై గత నెల చివర్లో తొలి చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది.

Read Here>>Indiaలో తయారైన Samsung గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు