Yo Yo Honey Singh: యోయో హనీ సింగ్‌పై గృహ హింస కంప్లైంట్

బాలీవుడ్ సింగర్.. యాక్టర్ యోయో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ గృహ హింస, లైంగిక హింస, మానసిక వేదింపులు, ఆర్థిక మోసం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ మేర అతని ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.

Yo Yo Honey Singh: యోయో హనీ సింగ్‌పై గృహ హింస కంప్లైంట్

Honey Singh

Yo Yo Honey Singh: బాలీవుడ్ సింగర్.. యాక్టర్ యోయో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ గృహ హింస, లైంగిక హింస, మానసిక వేదింపులు, ఆర్థిక మోసం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ మేర అతని ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.

మంగళవారం టిస్ హజారీ కోర్టుకు చెందిన చీఫ్ మెట్రోపొలిటన్ మెజిస్ట్రేట్ తానియా సింగ్ సమక్షంలో కేస్ రిజిష్టర్ అయింది. అడ్వకేట్ సందీప్ కపూర్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ లు షాలినీ తల్వార్ కు మద్దతుగా నిలిచారు. హనీ సింగ్ (హిర్దేశ్ సింగ్)కు నోటీసులు పంపి ఆగష్టు 28లోగా స్పందించాలని అడిగారు.

షాలినీ తల్వార్ కు అనుకూలంగా పాస్ అయిన ఆర్డర్స్ లో భార్యభర్తల జాయింట్ ప్రాపర్టీ గురించి ప్రస్తావించారు.

2014వ సంవత్సరం ఇండియా రాస్టార్ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ అతని భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బాలీవుడ్ లో మెగా ప్రాజెక్టులు చేయడానికి ముందే అతనికి పెళ్లి అయిందనే విషయం అప్పుడే తెలిసింది. దీపికా పదుకొనె, సైఫ్ అలీ ఖాన్ తో అంగ్రేజీ బీట్ సాంగ్ చేసి సూపర్ హిట్ కొట్టారు హనీ సింగ్.