IDY 2021 : 190 దేశాల్లో యోగా డే, ప్రసంగించనున్న పీఎం మోదీ

ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా డేగా నిర్వహించుకుంటారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగా..2021, జూన్ 21వ తేదీ సోమవారం ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

IDY 2021 : 190 దేశాల్లో యోగా డే, ప్రసంగించనున్న పీఎం మోదీ

Yoga Modi

7th International Yoga Day : ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా డేగా నిర్వహించుకుంటారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగా..2021, జూన్ 21వ తేదీ సోమవారం ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు వీటిని సమన్వయపరచనున్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా..పలు ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..యోగా డేను అతికొద్ది మంది మధ్య నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉదయం 6.30 గంటలకు దూరదర్శన్ ఛానెళ్లన్నింటిలో..మొదలయ్యే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పీఎం మోదీ..ప్రసంగించనున్నారు. అనంతరం శ్రీశ్రీ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ తో సహా 15 మంది అధ్యాత్మిక వేత్తలు, యోగా గురువులు సందేశాలు వినిపించనున్నారు. యోగాను ప్రజల వద్దకు చేరువ వేసేందుకు వెయ్యి సంస్థలు డిజిటల్ మాధ్యమంలో కార్యక్రమాలు చేపట్టనున్నాయి.