President Kovind : యోగా ఏ మతానికో చెందినది కాదు

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఒక రోజు ముందు ఆదివారం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు యోగాపై ఓ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.

President Kovind : యోగా ఏ మతానికో చెందినది కాదు

Kovind

President Kovind అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఒక రోజు ముందు ఆదివారం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు యోగాపై ఓ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఆరోగ్యం కోసం యోగా అనే ఓ ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మంలో కోవింద్ మాట్లాడుతూ…యోగా అనేది ఆధ్యాత్మికత యొక్క గొప్ప సైన్స్ అని అన్నారు. ప్రపంచానికి భారత్ బహుమతిగా యోగా గుర్తించబడిందన్నారు. యోగా వ‌ల్ల మెద‌డుకు శ‌రీరానికి మంచి ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. యోగా ఏ ఒక్క మ‌తానికో లేదా అసోసియేషషన్ కో చెందిన‌ది కాద‌ని, ఇది మొత్తం మాన‌వాళికి చెందిన‌ద‌ని అన్నారు.

సంపూర్ణ ఆరోగ్యం మరియు సామరస్యం కోసం యోగా అనే సందేశాన్ని పంచేందుకు కృషి చేస్తున్న యునైటెడ్ నేష‌న్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌, ఇత‌ర సంస్థ‌ల‌ను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కోవింద్‌తోపాటు కేంద్ర ఆయుష్ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు, ఆధ్యాత్మ‌క‌వేత్త క‌మ‌లేష్ ప‌టేల్‌, బ్యాడ్మింట‌న్ కోచ్ గోపీచంద్‌, సింగ‌ర్ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, రోనీ స్క్రూవాలా పాల్గొన్నారు. ప్ర‌తి ఏటా జూన్ 21ని అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.