Yogi Aditya Nath : నేడు యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

యోగి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ హాజరుకానున్నారు.

Yogi Aditya Nath : నేడు యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

Yogi Aditya Nath

Yogi Aditya Nath : యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య నాథ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు లక్నో అటల్ బిహారి వాజ్ పేయి ఏకాన స్టేడియంలో యోగి ఆదిత్య ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. గవర్నర్ ఆనంది బెన్ పటేల్.. యోగి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

యోగితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 60 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. 25-30 మంది కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. 37 ఏళ్ల తరువాత వరుసగా రెండో సారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

Yogi Adityanath : ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నాం : యోగి ఆదిత్యనాథ్

యోగి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానున్నారు. అఖిలేష్, ములాయం, మాయావతి, రాహుల్, ప్రియాంక గాంధీ, సోనియాగాంధీకి బీజేపీ ఆహ్వానాలు పంపారు.

‘నయా భారత్ కా నయా యూపీ’ పేరుతో స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 85 వేల మంది హాజరవుతారని అంచనా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను 255 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.