Yogi Adityanath: గూండాలు మీపై దాడిచేయరు.. బాలీవుడ్ ప్రముఖులతో యోగీ ఆదిత్యానాథ్

వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‭ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి..

Yogi Adityanath: గూండాలు మీపై దాడిచేయరు.. బాలీవుడ్ ప్రముఖులతో యోగీ ఆదిత్యానాథ్

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం చాలా భద్రంగా ఉందని, దాడులకు పాల్పడేందుకు గూండాలు ఎవరూ లేరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ పెట్టుబడిదారులతో అన్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటూ రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబై వచ్చిన యోగి.. శుక్రవారం ముంబైలో బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన సందర్భంగా యోగీ ఇచ్చిన హామీ ఇది. ‘‘2017కు ముందు పరిస్థితుల గురించి మీకు తెలుసు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏవేదో నేరాలు జరుగుతుండేవి. శాంతిభద్రతలు సరిగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు అమలులో ఉన్నాయి. మీపై (పెట్టుబడిదారులు) గూండాలు ఎవరూ దాడులు చేయరు. అలాగే మీ నుంచి టాక్సులు వసూలు చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి ఉండవు. ప్రభుత్వం 64,000 ఎకరాలను పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించింది’’ అని యోగీ అన్నారు.

Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‭కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‭లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు

వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‭ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగీ.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను వారికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాలలో సైతం రోడ్‌షోలను చేయడానికి ప్రణాళిక వేస్తున్నారు. ఇక దేశీయ పెట్టుబడులను తీసుకురావడానికి స్వయంగా యోగియే రంగంలోకి దిగి, పారిశ్రామిక నగరాలు తిరుగుతున్నారు.

MCD Mayor Election: మున్సిపల్ మీటింగులో ఆప్, బీజేపీ మధ్య హైడ్రామా.. మేయర్ ఎన్నిక వాయిదా