UP Election : మోదీతో పాటు యోగి గంగానదిలో ఎందుకు స్నానం చేయలేదంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.

UP Election : మోదీతో పాటు యోగి గంగానదిలో ఎందుకు స్నానం చేయలేదంటే..

Akilesh5

Akilesh Yadav :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. రాత్రి గంగా హారతిని వీక్షించారు. అయితే మోదీతో కలిసే ఉన్నప్పటికీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించలేదు.

యోగి ఆదిత్యనాథ్ గంగా నదిలో స్నానం చేయకపోవడంపై యూపీ మాజీ సీఎం,ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.  వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ఇప్పటికే వేగవంతం చేసిన అఖిలేష్ యాదవ్ మంగళవారం ఉత్తర ప్రదేశ్‌లోని సైఫాయిలో  మీడియాతో మాట్లాడుతూ…నది జలాలు మురికిగా ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్‌కు తెలుసునని, అందుకే ఆయన పవిత్ర స్నానం ఆచరించలేదని సెటైర్లు వేశారు.

గంగా నది ప్రక్షాళన కోసం బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. నిధులు ప్రవహించాయి తప్ప నది మాత్రం పరిశుభ్రంకాలేదని చెప్పారు. గంగమ్మ ఏనాటికైనా పరిశుభ్రంగా ఉంటుందా అనేదే ప్రశ్న అన్నారు.

ALSO READ Aklesh Yadav : చివరి చరమాంకంలోనే కాశీకి..మోదీ వారణాశి పర్యటనపై అఖిలేష్