Lakhimpur Case: అక్కాచెల్లెళ్ల హత్యాచార కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ సీఎం యోగి ఆదేశాలు

ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆరుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులు చోటు, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ ఉర్ రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు. వీరిలో జునైద్‮‭ను పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, పారిపోతుండే కాలికి బుల్లెట్ దింపినట్లు లఖీంపూర్ ఖేరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ తెలిపారు.

Lakhimpur Case: అక్కాచెల్లెళ్ల హత్యాచార కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ సీఎం యోగి ఆదేశాలు

Yogi Adityanath Orders Lakhimpur Case Will Hear In Fast Track Court

Lakhimpur Case: ఉత్తరప్రదేశ్‭లోని లఖింపురి ఖేరిలో వెలుగు చూసిన ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల అత్యాచారం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గురువారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి తెర లేసింది. ఈ ఘటనను ఉదహరిస్తూ.. ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని, బీజేపీ పాలనలో ఇవన్నీ సర్వసాధారణమేనని మండి పడుతున్నారు. కాగా, ఈ కేసుపై యూపీ ప్రభుత్వం స్పందిస్తూ నిందితులకు విధించే శిక్ష భయానకంగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటివి చేయాలంటే భయపడతారని గురువారం పేర్కొంది.

అసలు లఖింపూర్ ఖేరిలో ఏం జరిగిందంటే.. జిల్లాలోని ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై (ఒకరు 17 ఏళ్లు, మరొకరు 15 ఏళ్లు) సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా వారి చున్నీలతోనే చెట్టుకు ఉరితీశారు. పెళ్లి విషయమై ఒత్తిడి తీసుకురావడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు లఖింపూర్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆరుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులు చోటు, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ ఉర్ రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు. వీరిలో జునైద్‮‭ను పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, పారిపోతుండే కాలికి బుల్లెట్ దింపినట్లు లఖీంపూర్ ఖేరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ తెలిపారు. చోటు అనే వ్యక్తి మినహా మిగిలిన వారంతా జిల్లాలోని లాల్‭పూర్ గ్రామానికి చెందినవారని, ఇద్దరు బాలికల ఇంటికి సమీపంలోనే చోటు కుటుంబం నివాసం ఉంటుందని పేర్కొన్నారు. ఇతడే బాలికలిద్దరినీ జునైద్, సుహైల్‭కు పరిచయం చేశాడట.

బాలికలిద్దరినీ బైక్‭లపై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. జునైద్, సుహైల్‭లతో వారికి ఎప్పటి నుంచో స్నేహం ఉందని, అయితే పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి తీసుకెళ్లిన మూడు గంటల్లోనే వారు చెట్టుకు వేలాడుతూ కనిపించారని బాధిత అక్కాచెల్లెళ్ల తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల చున్నీలతోనే ఉరి తీశారట. అయితే దానికి ముందు వారిపై అత్యాచారం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బదౌన్‭లో 2014లో జరిగిన దారుణ ఘటనను తాజా ఘటన గుర్తు చేస్తోంది. అప్పట్లో సైతం ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసి ఇలాగే చెట్టుకు ఉరితీశారు.

BJP apologises: కార్యక్రమం రద్దు చేసిన కోహిమా బాప్టిస్ట్ చర్చి.. క్షమాపణలు చెప్పిన బీజేపీ