కాంగ్రెస్‌కు ఆ పార్టీ వైరస్ సోకింది.. ప్రజలు జాగ్రత్త : సీఎం యోగి

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

  • Published By: sreehari ,Published On : April 5, 2019 / 06:42 AM IST
కాంగ్రెస్‌కు ఆ పార్టీ వైరస్ సోకింది.. ప్రజలు జాగ్రత్త : సీఎం యోగి

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ఫైర్ బ్రాండ్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని వైరస్ తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం లీగ్ పార్టీ .. వైరస్ లాంటిదని, ఈ వైరస్ సోకినవారు ఎప్పటికి కోలుకోలేరని  ఆయన అన్నారు.
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ

ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ వైరస్ సోకిందని యోగి విమర్శించారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ నామినేషన్ వేసిన అనంతరం యూపీ సీఎం యోగి ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీతో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూటమిగా ఏర్పడింది. వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్ కు రావడంతో పచ్చ జెండాలతో ఘన స్వాగతం పలికారు. దీనిపై సీఎం యోగి.. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ వైరస్ సోకిందని, ప్రజలు వైరస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటూ యోగి సూచించడం కేరళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఫైర్ బ్రాండ్ కు పెట్టింది పేరైన యూపీ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇండియన్ ఆర్మీని మోడీకీ సేన అంటూ వ్యాఖ్యానించిన యోగికి ఎన్నికల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.

Read Also : పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్‌.అంబేద్కర్ మనవడు