New Population Policy : పాపులేషన్ పాలసీని లాంఛ్ చేసిన యూపీ సీఎం

ఇవాళ(జులై-11) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని(వరల్డ్ పాపులేషన్ డే) పురస్కరించుకుని జనాభా అదుపునకు ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 సంవత్సరానికి కొత్త పాపులేషన్ పాలసీని లాంఛ్ చేశారు.

New Population Policy : పాపులేషన్ పాలసీని లాంఛ్ చేసిన యూపీ సీఎం

Up Cm

New Population Policy ఇవాళ(జులై-11) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని(వరల్డ్ పాపులేషన్ డే) పురస్కరించుకుని జనాభా అదుపునకు ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 సంవత్సరానికి కొత్త పాపులేషన్ పాలసీని లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యానథ్ మాట్లాడుతూ..మరింత సమానమైన పంపిణీతో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి జనాభాను నియంత్రించడానికి మరియు స్థిరీకరించడానికి బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అంశంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ నొక్కిచెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ పాపులేషన్ పాలసీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం యోగి తెలిపారు.

జనాభా పెరుగుదల రాష్ట్రంతో బాటు దేశ అభివృద్ధికి కూడా అవరోధంగా మారుతుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇది పేదరికానికి కూడా కారణమవుతుందన్నారు. పాపులేషన్ పాలసీ..జనాభా స్థిరీకరణకు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క మార్గాన్ని తన ఇంటి వద్దకు తీసుకురావడానికి కూడా సంబంధించినది అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 2026 నాటికల్లా బర్త్ రేటుని ప్రతి వెయ్యి జనాభాకు 2.1 నిష్పత్తికి,2030 నాటికి 1.9 నిష్పత్తికి తగ్గించాలని కొత్త పాపులేషన్ పాలసీలో నిర్దేశించామన్నారు. రాష్ట్రంలో జనాభాను అదుపు చేయాలంటే ఇద్దరు బిడ్డల మధ్య గ్యాప్ లేదా ఎడం ఉండాలని ఆయన సూచించారు. ఈ పాలసీకింద అన్ని కుటుంబ నియంత్రణ చర్యలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కాగా,పాపులేషన్ కంట్రోల్ ముసాయిదా బిల్లు-2021 ను స్టేట్ లా కమిషన్ రూపొందించింది. దీనికి ఈ నెల 19 లోగా ప్రజల నుంచి సూచనలు, సలహాలను పంపవచ్చునని కోరింది.

ఈ పాలసీ ప్రకారం..ఇద్దరు బిడ్డలకు మించి సంతానం గలవారు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకూ అనర్హులు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి. ఈ నిబంధనను అతిక్రమించిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలూ ఉండవు. ఇక ఇంట్లో కేవలం నలుగురికే రేషన్ కార్డును పరిమితం చేస్తూ నిబంధనను పొందుపరిచింది ప్రభుత్వం. అలాగే ఇద్దరు పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సహకాలను ఇవ్వనుంది. మొత్తం సర్వీస్ లో రెండు అదనపు ఇంక్రిమెంట్లను ఇస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనుంది. వాటితో పాటు కరెంట్, నీటి బిల్లుల్లో రాయితీలు, భవిష్యనిధిలో 3 శాతం ఇంక్రిమెంట్ వంటి వాటిని అందిస్తారు. ఒక్కరే సంతానం ఉంటే నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటు ఆ సంతానానికి 20 ఏళ్లు వచ్చేదాకా ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని ఆ ముసాయిదాలో పేర్కొంది. అంతేకాదు ఐఐటీల్లో చాలా సులభంగా ప్రవేశం దక్కనుంది.

మరోవైపు అస్సాం ప్రభుత్వం కూడా ఇదే నినాదమిచ్చింది. టూ చైల్డ్ పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే యూపీ ప్రభుత్వం అప్పుడే ఈ పాలసీని రిలీజ్ చేయడం విశేషం. అయితే యోగి సర్కార్ తీసుకొచ్చిన పాపులేషన్ పాలసీని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదొక “రాజకీయ ఎజెండా”గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇది “ప్రజాస్వామ్య హత్య”గా సమాజ్ వాదీ పార్టీ అభివర్ణించింది.