Uttar Pradesh CM : యోగి ఢిల్లీ టూర్..సర్వత్రా ఆసక్తి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో...నాయకత్వ మార్పు, కేబినెట్ లో ప్రక్షాళన జరుగుతుందా ? అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Uttar Pradesh CM : యోగి ఢిల్లీ టూర్..సర్వత్రా ఆసక్తి

Yogi uttarpradesh

CM Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో…నాయకత్వ మార్పు జరుగుతుందా ? అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యూపీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో పట్టున్న కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలోకి జంప్ కావడం..తర్వాతి రోజు యోగి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారని సమాచారం. 2021, జూన్ 10వ తేదీ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. తర్వాత శుక్రవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నారు సీఎం యోగి. యూపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇతరత్రా వాటిపై చర్చించనున్నారని సమాచారం. మంత్రివర్గ కూర్పు ఇతర వాటిపై వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

లక్నోలో రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో బుధవారం అర్థరాత్రి యోగి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలమైన అసెంబ్లీ ఎన్నికలంటే ముందు..యూపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read More : Telangana Corona : 24 గంటల్లో 1798 కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్ని అంటే