Untouchability: హిందువులుగా ఉన్నంత వరకు అంటరానివారే: వివాదంలో డీఎంకే ఎంపీ వ్యాఖ్యలు

సనాతన ధర్మాన్ని సవాల్ చేయడం కోసం కుల వ్యవస్థ మీద ధ్వజమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి ద్రవిడార్ కళగం సాంఘీకోద్యమాన్ని ప్రారంభించారని అన్న ఆయన.. కుల వ్యవస్థ, అంటరానితం వంటి జాఢ్యాలను నిర్మూలించడమే ఈ ఉద్యమ లక్ష్యమని గుర్తు చేశారు. వ్యభిచారి కొడుకుగా ఎందుకు ఉండాలని, అంటరానివారిగా ఎందుకు ఉండాలని గట్టిగా ప్రశ్నించినప్పుడే సనాతన ధర్మం కూకటి వేళ్లతో కూలిపోతుందని ఏ రాజా అన్నారు.

Untouchability: హిందువులుగా ఉన్నంత వరకు అంటరానివారే: వివాదంలో డీఎంకే ఎంపీ వ్యాఖ్యలు

You are an untouchable till you are a Hindu says DMK MP

Untouchability: తమిళనాడులో కొనసాగిన నాస్తికోద్యమం, హిందీ వ్యతిరేకోద్యమం గురించి ప్రత్యేక చెప్పాల్సిన అసవరం లేదు. హిందూ వ్యవస్థలోని అంతరానితనాన్ని ఇతర పద్దతులను ఈ రెండు ఉద్యమాలు ప్రధానం సవాలు చేశాయి. ఆ ప్రభావం రాష్ట్రంపై ఇప్పటికీ ఉంటుంది. అందుకే కాబోలు.. తమిళానాడు నుంచి వెలువడే కొన్ని వ్యతిరేకతలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిందూ మతానికి వ్యతిరేకంగా తమిళనాడు నుంచే ఎక్కువ వ్యతిరేకత వస్తుంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.

తాజాగా తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ్ మున్నేట్ర కజగం(డీఎంకే)కు చెందిన ఎంపీ ఏ రాజా చేసిన వ్యాఖ్యలపై భారీ వివాదం రేగేలాగే కనిపిస్తోంది. హిందూ మతంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి రావడంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇతర మతాల్ని బుజ్జగించడానికి ఒక మతంపై వ్యతిరేత చూపిస్తూ రాజకీయాలు చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అణ్ణమలై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. హిందూ మతంలోని అంటరాని వ్యవస్థపై ఎంపీ ఏ రాజా మండిపడ్డారు. నమక్కల్‭లో గతవారం నిర్వహించిన ఓ క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘నువ్వు హిందువుగా ఉన్నంత వరకు నువ్వు శూద్రునిగానే ఉంటావు. శూద్రునిగా ఉన్నంత వరకు నువ్వు వ్యభిచారి కొడుకువి. నువ్వు హిందువుగా ఉన్నంత వరకు నువ్వు దళితుడివి. హిందువుగా ఉన్నంత వరకు నువ్వు అంటరానివాడివి’’ అని అన్నట్లు తెలుస్తోంది.

Rajasthan: సొంత పార్టీ నుంచే మంత్రికి ఘోర అవమానం.. సభలో మాట్లాడుతుండగా చెప్పులు విసిరిన పైలట్ మద్దతుదారులు

అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు కొత్తేం కాదు. గతంలో సుప్రీంకోర్టుపై సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. క్రైస్తవ, ముస్లిం, పర్షియన్ కాకపోతే తప్పనిసరిగా హిందువే అవ్వాలని సుప్రీంకోర్టు చెప్తోందని, ఇలాంటి దురాగతం మన దేశంలో తప్పితే మరే దేశంలో ఉండదని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని సవాల్ చేయడం కోసం కుల వ్యవస్థ మీద ధ్వజమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి ద్రవిడార్ కళగం సాంఘీకోద్యమాన్ని ప్రారంభించారని అన్న ఆయన.. కుల వ్యవస్థ, అంటరానితం వంటి జాఢ్యాలను నిర్మూలించడమే ఈ ఉద్యమ లక్ష్యమని గుర్తు చేశారు. వ్యభిచారి కొడుకుగా ఎందుకు ఉండాలని, అంటరానివారిగా ఎందుకు ఉండాలని గట్టిగా ప్రశ్నించినప్పుడే సనాతన ధర్మం కూకటి వేళ్లతో కూలిపోతుందని ఏ రాజా అన్నారు.

కాగా, ఎంపీ ఏ రాజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షఉడు కె.అణ్ణమలై షేర్ చేస్తూ ‘‘తమిళనాడులో రాజకీయ చర్చ దయనీయంగా ఉంది. అరివలయం ఎంపీ ఏ రాజా మరోసారి ఓ మతంపై విద్వేషం చిమ్మారు. ఆయన ఏకైక లక్ష్యం ఇతర మతాలవారిని బుజ్జగించి, తమ వైపు తిప్పుకోవడమే. తమిళనాడు తమ సొంతమని భావించే ఇటువంటి రాజకీయ నేతల ఆలోచనా ధోరణి చాలా చాలా దురదృష్టకరం’’ అని ట్వీట్ చేశారు.

BJP vs Police: సెక్రెటేరియట్ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య బాహాబాహి