దేశాధినేతల్ని ప్రశ్నించిన బాలికకు సపోర్ట్‌గా రోహిత్ శర్మ

దేశాధినేతల్ని ప్రశ్నించిన బాలికకు సపోర్ట్‌గా రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఐక్యరాజ్య సమితిలో పర్యావరణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి వేడి పుట్టించిన గ్రెటా థున్‌బర్గ్‌ అనే బాలికకు సపోర్ట్‌గా నిలిచాడు. పర్యావరణాన్ని నాశనంచేసేలా వ్యవహరిస్తున్నారని.. భవిష్యత్ తరాల జీవితాలను నాశనం చేస్తున్నారంటూ  మండిపడింది. మా బాల్యాన్ని చిదిమేయటానికి మీకెవరిచ్చారు? మీకెంత ధైర్యం మా భవిష్యత్తుని నాశనం చేయటానికి అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించింది.

పర్యావరణం నాశనం అయిపోతోంది. దీనికి మీరంతా సమాధానం చెప్పి తీరాలంటూ నిలదీసింది. పర్యావరణం ప్రతీప్రాణి సొత్తు దాన్ని నాశనం చేయటానికి మీకెవరిచ్చారు ఆ అధికారం? అంటూ నిలదీసింది. ప్రపంచంలోని ప్రధానులు.. అధ్యక్షులు అంతా మా కలలను నాశనం చేస్తున్నారు.  అధికారం..డబ్బు,అభివృద్ధి అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ కథలు చెబుతున్నారు..ఎవరి అధికారాలు వారు కాపాడుకునేందుకు ప్రజల్ని సమస్యల పాలు చేస్తున్నారంటూ నిలదీసింది. 

ఈ వ్యాఖ్యలు చేసిన థున్ బర్గ్ వీడియోను పోస్టు చేస్తూ.. రోహిత్ శర్మ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేశాడు. ‘మీరు ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. మీ ప్రసంగం విన్న తర్వాత మాటల్లేవు. భవిష్యత్ జనరేషన్స్‌కు భూమిని జాగ్రత్తగా అందించాలి. ఇది మార్పుకు సరైన సమయం’ అంటూ ట్వీట్ చేశాడు.