Noise Pollution: నాయీస్ చేశారా.. లక్ష ఫైన్ కట్టాల్సిందే

సిటీలో ఏదైనా నాయీస్ పొల్యూషన్ చేశారా.. ఇక అంతే భారీ మొత్తంలో ఫైన్ కట్టాల్సిందే. ఈ మేర ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) అమెండ్‌మెంట్ రిలీజ్ చేసింది. రీసెంట్‌గా అమల్లోకి వచ్చిన ఫైన్‌లను బట్టి దాదాపు రూ.1లక్ష వరకూ ఉండొచ్చని అధికారులు అంటున్నారు.

Noise Pollution: నాయీస్ చేశారా.. లక్ష ఫైన్ కట్టాల్సిందే

Noise Pollution (1)

Noise Pollution: సిటీలో ఏదైనా నాయీస్ పొల్యూషన్ చేశారా.. ఇక అంతే భారీ మొత్తంలో ఫైన్ కట్టాల్సిందే. ఈ మేర ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) అమెండ్‌మెంట్ రిలీజ్ చేసింది. రీసెంట్‌గా అమల్లోకి వచ్చిన ఫైన్‌లను బట్టి దాదాపు రూ.1లక్ష వరకూ ఉండొచ్చని అధికారులు అంటున్నారు.

కొత్త రూల్ ప్రకారం.. విడివిడిగా అయినా ఎవరైతే రెసిడెన్షియల్ బిల్డింగులు, కమర్షియల్ ఏరియాల దగ్గర ఫైర్ క్రాకర్స్ కాలుస్తారో.. వారు వెయ్యి రూపాయల ఫైన్ కట్టాలి. సైలెంట్‌గా ఉండే ఏరియాల్లో అలా చేస్తే రూ.3వేలు సమర్పించాల్సిందే.

ఒకవేళ పెళ్లిళ్లకు, మతపరమైన వేడుకలకు ర్యాలీ కండక్ట్ చేసి ఫైర్ క్రాకర్స్ రూల్స్ బ్రేక్ చేస్తే.. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాల్లో పాల్పడితే రూ.10వేలు, సైలెంట్ జోన్స్ లో చేస్తే రూ.20వేలు కట్టాలి.

అదే ప్రాంతంలో రెండోసారి కూడా చేస్తే.. ఫైన్ అమౌంట్ రూ.40వేలకు పెరుగుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేస్తే దాదాపు రూ.1లక్ష వరకూ చెల్లించాలి. అంతేగాక ఆ ఏరియాను సీల్ చేస్తారు కూడా. జనరేటర్ సెట్స్ కారణంగా నాయీస్ పొల్యూషన్ పెరిగిపోతుందని డీపీసీసీ చెప్పింది. శబ్ధ కాలుష్యం వచ్చే విధంగా ఉన్న ప్లాంట్లను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఈ ప్రపోజల్స్ ను అంగీకరించింది. సంబంధిత డిపార్ట్‌మెంట్లు కొత్త రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని ప్రతినెలా రిపోర్టు సబ్‌మిట్ చేయాలని చెప్పింది.