Passport: ఇస్మార్ట్ పోస్టాఫీస్.. ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తులు కూడా!

ఇండియాలో పోస్టాఫీసులు ఇస్మార్ట్ గా మారుతున్నాయి. ఇందుకోసం ఒక్కోసేవను పెంచుకుంటూపోతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నాయి. ఈ మధ్యనే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను ప్రారంభించింది.

Passport: ఇస్మార్ట్ పోస్టాఫీస్.. ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తులు కూడా!

Passport

Passport: ఇండియాలో పోస్టాఫీసులు ఇస్మార్ట్ గా మారుతున్నాయి. ఇందుకోసం ఒక్కోసేవను పెంచుకుంటూపోతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నాయి. ఈ మధ్యనే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను ప్రారంభించింది. అంతేకాదు, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.

కాగా, ఇక ఇప్పుడు పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తులను కూడా ఇండియా పోస్ట్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. ఇకపై, దేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో కూడా పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) కౌంటర్లను సందర్శిస్తే చాలు.

పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాలను ప్రారంభించిన సంగతి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. ‘ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి’ అని ట్వీట్ లో పేర్కొంది. దీనిద్వారా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రింట్ రసీదు, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసులో కూడా సంప్రదించవచ్చు.