Delhi-NCR Pollution : ఢిల్లీ కాలుష్యానికి పాకిస్తానే కారణమన్న యూపీ..సీజేఐ ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై

Delhi-NCR Pollution : ఢిల్లీ కాలుష్యానికి పాకిస్తానే కారణమన్న యూపీ..సీజేఐ ఘాటు వ్యాఖ్యలు

Sc

Delhi Pollution :  ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్…ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తగ్గుముఖం పట్టాయని, యూపీ పరిశ్రమల కలుషిత గాలి ఢిల్లీ వైపు వెళ్లడం లేదని వాదించారు. పాకిస్తాన్ వైపు నుంచి వెలువడే కలుషిత గాలే..ఢిల్లీలోని గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుందని యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకి తెలిపారు. యూపీ దిగువగా ఉన్నందున పాకిస్థాన్ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. పాకిస్థాన్​లోని పరిశ్రమలు మూసివేయమంటారా అని ప్రశ్నించింది. అయితే, ఎనిమిది గంటల సమయం పరిమితితో ఉత్తరప్రదేశ్‌లోని చెరకు, పాల పరిశ్రమలు దెబ్బతింటాయని రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

కాగా, రాజధానిలో వాయు కాలుష్య నివారణకు క్షేత్ర స్థాయి చర్యలు ఏమీ కనిపించడం లేదని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాలుష్య నివారణకు తీసుకోనున్న చర్యలపై 24 గంటల (శుక్రవారం ఉదయం పది గంటలు)లోగా సమాచారం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశాయి.

వాయు కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్​లను ఎయిర్ క్వాలిటీ మేనేజ్​మెంట్ కమిషన్​ ఏర్పాటు చేసిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణ పనులు కొనసాగించేందుకు అనుమతించాలని దిల్లీ ప్రభుత్వం కోరగా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. హాస్పిటల్స్ నిర్మాణ పనులు కొనసాగించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది.

అయితే ఢిల్లీ కాలుష్యంపై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసం ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేదో తెలియదు. కానీ, మీడియాలోని కొన్ని వర్గాలు మమ్మల్ని విలన్లుగా చూపించేందుకు యత్నిస్తున్నాయి. పాఠశాలలను మూసివేయాలని మేం కోరుకుంటున్నామని చెప్పాయి” అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ALSO READ Super Strain : మరో కొత్త వేరియంట్ రావచ్చు..డెల్టా+ఒమిక్రాన్= సూపర్ స్ట్రెయిన్!