వీళ్లకు ఏ శిక్ష వేయాలి : బైక్ పై వెళుతూ యువజంట రొమాన్స్

మహిళ బైక్ పెట్రోల్ ట్యాంకుపై నడిపే వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉంది. అంతేకాదు.. తన కాళ్లను రైడర్ కు ఇరువైపులా సాచి అతడ్ని ముద్దుపెట్టుకుంటోంది.

  • Published By: sreehari ,Published On : May 3, 2019 / 01:41 PM IST
వీళ్లకు ఏ శిక్ష వేయాలి : బైక్ పై వెళుతూ యువజంట రొమాన్స్

మహిళ బైక్ పెట్రోల్ ట్యాంకుపై నడిపే వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉంది. అంతేకాదు.. తన కాళ్లను రైడర్ కు ఇరువైపులా సాచి అతడ్ని ముద్దుపెట్టుకుంటోంది.

మేఘాలలో తేలిపోమన్నది.. తూఫానులా రేగిపొమన్నది.. అమ్మాయితో సాగుతూ చిలిపి మది. బీట్ ఇన్ మై హార్ట్.. ఎందుకింత కొత్తగుంది. హీట్ ఇన్ మై తాట్.. వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్.. ఏమిటింత కొత్తగున్నది.. అప్పటి తెలుగు సినిమా గులాబిలోని పాటలా.. ఢిల్లీకి చెందిన ఓ జంట బైక్ పై రయ్యమంటూ దూసుకెళ్లింది.

బిజీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ జంప్ చేస్తూ వచ్చేపోయే వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ ఈ యువ జంట మోటార్ సైకిల్ పై దూసుకెళ్లింది. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్, క్రిటి నగర్ క్రాసింగ్ దగ్గర కనిపించిన ఈ జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే మార్గంలో వెళ్తున్న మరొకరు ఈ వీడియోను ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో యువ జంట.. హెల్మెట్లు లేకుండా బైక్ డ్రైవ్ చేస్తూ.. ట్రాఫిక్ లేన్స్ జంప్ చేస్తూ స్పీడ్ గా దూసుకెళ్లారు. ఇందులో మహిళ బైక్ పెట్రోల్ ట్యాంకుపై నడిపే వ్యక్తికి ఎదురుగా కూర్చొని ఉంది. అతడ్ని ముద్దుపెట్టుకుంటున్నట్టుగా వీడియోలో ఉంది.

ఈ వీడియోను ఢిల్లీ పోలీసు ఐపీఎస్ అధికారి హెచ్ జీఎస్ ధాలివాల్ కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘిస్తున్న ఇలాంటి ఘటనలపై మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కొత్త సెక్షన్లు అవసరమంటూ ఆయన ట్వీట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..