Beautiful Love Story : పెళ్లికి ముందు ఘోర ప్రమాదం.. ఆసుపత్రి పాలైన పెళ్లికూతురు.. ఆ పెళ్లి జరిగిందా?

ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.

Beautiful Love Story : పెళ్లికి ముందు ఘోర ప్రమాదం.. ఆసుపత్రి పాలైన పెళ్లికూతురు.. ఆ పెళ్లి జరిగిందా?

Beautiful Love Story

Beautiful Love Story :  పెళ్లి చేసుకోబోయే జంట అందమైన కలలు కంటుంది. వారి కలలు నిజమయ్యే సమయంలో వారికిలో ఒకరికి అనుకోని ప్రమాదం జరిగితే? ఇక్కడే వారి ప్రేమ మరింత బలపడింది.. ఆలస్యం చేయకుండగా ప్రతీక్, సతాక్షి ప్రేమ కథ చదవండి.

Live in relationships brutal murders: విషాదంగా మారుతున్న ప్రేమ కథలు.. తప్పు ఎవరిది?

పెళ్లి అనగానే ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు. తన భవిష్యత్‌ని అందంగా ఊహించుకుంటారు. ఫిజియోథెరపిస్ట్ అయిన సతాక్షి అలాగే అనుకుంది. ఇంట్లో ప్రతీక్‌తో పెళ్లి నిశ్చయించారు. త్వరలో నిశ్చితార్ధం.. ఆ తరువాత పెళ్లి అనుకునే లోపు సతాక్షి భయంకరమైన ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం వారి ప్రేమను, అనుబంధాన్ని ఏ మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న సతాక్షికి  ప్రతీక్ సపర్యలు చేశాడు. రక్తదానం చేయడంతో పాటు అనుక్షణం ఆమె వెన్నంటి నీడలా కాపాడుకున్నాడు. ప్రమాదం జరిగిన రెండు నెలల తరువాత సతాక్షి కోలుకుంది. అప్పుడు ఎంతో వైభవంగా నిశ్చతార్థం, వివాహం చేసుకున్నారు. వివాహసమయంలో కూడా నడవలేని పరిస్థితిలో ఉన్న సతాక్షిని ఎత్తుకుని అడుగులు వేసాడు ప్రతీక్. తమ అందమైన ప్రేమకథను సతాక్షి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. “ఇది మా కథ.. మీ క్యూరియాసిటీ తగ్గడానికి ఈ పోస్ట్ సరిపోతుందని ఆశిస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో అందరి మనసులు దోచుకుంది.

IAS Chandini Chandran‌ : ఐఏఎస్ అధికారిణి అందమైన ప్రేమ కథ..మధుర జ్ఞాపకాల చిత్రం

సతాక్షి కోలుకోవడం కోసం ప్రతీక్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇద్దరికీ శుభాకాంక్షల జల్లు కురిపించారు. పెళ్లి కుదరగానే ఇలాంటి ఘటనలు జరిగినపుడు చాలామంది అపోహలతో, మూఢనమ్మకాలతో పెళ్లిని నిలిపేస్తారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాకపోయినా సతాక్షి కోలుకునేవరకూ వెన్నంటి ఉండి ఆమెను వివాహం చేసుకున్న ప్రతీక్ ప్రేమ గొప్పది. పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటగా భావిస్తున్న జంటలకు ఈ ప్రేమ కథ ఖచ్చితంగా ఆదర్శమని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Pregnancy care by Shatakshi (@preganest)