అందుకే వాటర్ క్యాన్ల ట్యాప్ బంద్ చేశా – యువ రైతు

  • Published By: madhu ,Published On : November 28, 2020 / 01:43 PM IST
అందుకే వాటర్ క్యాన్ల ట్యాప్ బంద్ చేశా – యువ రైతు

Switched Off a Police Water Cannon : ఢిల్లీ చలో పేరిట రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఓ యువ రైతు చేసిన సాహసం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Farmer protest icon అని, రైతుల పక్షాన నిలబడ్డాడు..‘రియల్‌ హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వాటర్ క్యాన్ వాహనంపై ఎక్కి ట్యాప్ బంద్ చేసి..అమాంతం..ట్రాక్టర్ పైకి దూకడంతో..నిరసన కారులు చప్పట్లు కొట్టారు.



అతనితో ఓ జాతీయ ఛానెల్ మాట్లాడగా..పలు విషయాలు వెలుగు చూశాయి.అంబాలా ప్రాంతానికి చెందిన ఓ వ్యవసాయ కుటుంబంలో నవదీప్ సింగ్ జన్మించాడు. ఇతను గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్. చదువు పూర్తయిన తర్వాత..నాన్నతో కలిసి వ్యవసాయం చేయడం జరిగిందని, రైతు నాయకుడైన నాన్న..వారి సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. ఇంతవరకు తాను గాని..నాన్న గాని..ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు. ఢిల్లీ చలో పేరిట..తాము శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని, కానీ..పోలీసులు టియర్ గ్యాస్, బాష్పవాయుగోళాలు ప్రయోగించారన్నారు.



https://10tv.in/purnia-central-jail-prison-to-have-atm/
నిరసనను అడ్డుకోవడం ఎంతమాత్రం సరైంది కాదనే అభిప్రాయం తనలో ఉందన్నారు. తమ సమస్యలు కేంద్రానికి వినిపించేలా కార్యక్రమం చేస్తున్నట్లు, వాటర్ క్యాన్లను రైతులపై ప్రయోగించడంతో తట్టుకోలేకపోయానన్నారు. అమాంతం..ఆ వాహనంపైకి ఎక్కి ట్యాప్ బంద్ చేశానని నవదీప్ వెల్లడించారు. అంతకు మందు తనకు చెట్లు ఎక్కడం రాదన్నారు. ప్రశ్నించే హక్కు పౌరులకు లేదా ? ట్యాప్ బంద్ చేసినందుకు తనపై పోలీసులు కేసులు పెట్టారని అతను వాపోయాడు.



నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు ఢిల్లీ చలో పేరిట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. నిరసనకారులను అడ్డుకొనేందుకు కఠిన చర్యలకు దిగారు. టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అందులో భాగంగా నవదీప్ పోలీసుల వాహనంపైకి ఎక్కి ట్యాప్ కట్టేసి ట్రాక్టర్ పైకి దూకాడు.