Maruti 800: పాతికేళ్ల మారుతీ 800తో దేశమంతా చక్కర్లు కొడుతోన్న యంగ్‌స్టర్స్

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రోడ్ ట్రిప్ లో వెళ్తూ కనిపించారు. అయితే వారు ప్రయాణించడానికి ఎంచుకునే మార్గాలే డిఫరెంట్ గా..

Maruti 800: పాతికేళ్ల మారుతీ 800తో దేశమంతా చక్కర్లు కొడుతోన్న యంగ్‌స్టర్స్

Maruthi 800

Maruti 800: గతేడాది లాక్ డౌన్ తర్వాత చాలా దూరం పాటు ప్రయాణిస్తున్న బాటసారుల వీడియోలు చక్కర్లు కొట్టాయి. వారిలో కొందరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రోడ్ ట్రిప్ లో వెళ్తూ కనిపించారు. అయితే వారు ప్రయాణించడానికి ఎంచుకునే మార్గాలే డిఫరెంట్ గానూ.. ఆశ్చర్యకరంగానూ అనిపిస్తున్నాయి.

కొందరు మోటార్ సైకిల్స్ వాడుతుంటే, మరి కందరు కార్లతో తిరిగేస్తున్నారు. కేరళ నుంచి మనాలి వరకూ లేదా కశ్మీర్ వరకూ సైకిల్ మీద లేదా కాలి నడకన వెళ్లే వారూ ఉన్నారు. అయితే ఓ గ్రూపు ఇదే కాన్సెప్ట్ తో బయల్దేరింది. వారు ఎంచుకున్న ట్రాన్స్ పోర్ట్ వెహికల్ ఏంటో తెలుసా.. పాతికేళ్ల పాత మారుతీ 800. అదెలా అనుకుంటున్నారా.. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

వీళ్లు చేసిన ఫీట్ కు నేరుగా మారుతీ సుజుకీనే వాళ్లు యూట్యూబ్ ఛానెల్ లో వీడియో అప్ లోడ్ చేసకుంది. కేరళలోని మలప్పురం జిల్లా నుంచి బయల్దేరిన వీరు.. లాక్ డౌన్ తర్వాత రోడ్ ట్రిప్ ఎలా చేశారనేది అందులో ఉంది. మొత్తం 25రాష్ట్రాల్లో 8వేల 500కిలోమీటర్ల పాటు ప్రయాణించారు.

Maruthi 800 (1)

Maruthi 800 (1)

కొద్ది పాటి మాడిఫికేషన్స్ చేసి నలుగురు ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ స్టీల్ రిమ్స్ ను మార్చి అల్లోయ్ వీల్స్ గా.. లగేజ్ ర్యాక్ పెట్టుకుని, దానికి ముందు ఆగ్జిలరీ ల్యాంప్ తో ప్రయాణిస్తూ ఉన్నారు. అవి కాకుండా బయటి వైపు పెద్ద మార్పులేమీ చేయలేదు. ఈ రోడ్ ట్రిప్ పూర్తి చేయడానికి వారికి 27రోజుల సమయం మాత్రమే పట్టిందట.

కేరళ నుంచి మొదలుపెట్టిన ఈ పర్యటనను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లాంటి ఉత్తరాధి రాష్ట్రాల మీదుగా పూర్తి చేశారు. కాకపోతే ఈ వీడియోలో కారు ఇసుక ప్రాంతంలో ఓ సారి ఇరుక్కుపోయిందట పాపం. రోడ్లు లేని చోట కూడా ప్రయాణించిందన్న మాట పాతికేళ్ల మారుతీ 800.

మారుతీ 800 ప్రొడక్షన్ 1983లో మొదలైంది. ఇప్పటికీ కండిషన్లో ఉన్న కార్లు, తర్వాతి జనరేషన్ మోడల్స్ రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి.