ప్రైవేట్ ఉద్యోగుల “టేక్ హోమ్” శాలరీ తగ్గిపోనుందట

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 05:12 PM IST
ప్రైవేట్ ఉద్యోగుల “టేక్ హోమ్” శాలరీ తగ్గిపోనుందట

salary

Your Take-Home Salary May Reduce 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గిపోయే అవకాశం ఉంది. కొత్త వేతన నిబంధన కింద డ్రాఫ్ట్ రూల్స్ ని ప్రభుత్వం నోటీఫై చేశాక కంపెనీలు అన్నీ “పే ప్యాకేజీలు”ని పునరుద్ధరించాల్సిన అవసరమున్న నేపథ్యంలో వచ్చే ఆర్థికసంవత్సరం నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది. కోడ్ ఆన్ వేజస్(వేతనాలు)2019లో భాగమైన కొత్త కాంపన్సేషన్(పరిహారం)రూల్స్ వచ్చే ఆర్థికసంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నుంచి ప్రభావితంగా ఉండే అవకాశముంది.



కొత్త రూల్స్ ప్రకారం అలవెన్స్ భాగం…మొత్తం జీతం లేదా పరిహారంలోని 50శాతాన్ని మించకూడదు. ఇది ప్రాథమికంగా బేసిక్ శాలరీ 50 శాతం ఉండాలని సూచిస్తుంది. ఈ నిబంధనను పాటించటానికి కంపెనీలు… జీతాల యొక్క ప్రాథమిక వేతన(బేసిక్ పే) భాగాన్ని పెంచాల్సి ఉంటుంది. దీని ఫలితంగా గ్రాట్యుటీ చెల్లింపులు మరియు ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కు ఉద్యోగుల సహకారం తగినంత పెరుగుతుంది. రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ ఫలితంగా ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. అయితే,ఉద్యోగుల రిటైర్మెంట్ కార్పస్(నిధి)పెరుగుతుంది.



ప్రస్తుతం చాలా ప్రైవేటు కంపెనీలు… మొత్తం పరిహారంలో నాన్-అలవెన్స్ భాగాన్ని 50 శాతం కన్నా తక్కువ మరియు అలవెన్స్ భాగాన్ని ఎక్కువగా సెట్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. అయితే, కొత్త వేతన నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఇది మారుతుంది.



ప్రేవేటు సెక్టార్ ఉద్యోగులపై కొత్త రూల్స్ ప్రభావం పడనుంది. కోత్త రూల్స్ ప్రకారం..50శాతం “బేసిక్ పే”ని చేరుకునేందుకు కంపెనీలు తమ ఉద్యోగుల బేసిక్ పే ని పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గిపోయే అవకాశముంది. అయితే బెటర్ సోషల్ సెక్యూరిటీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని అందించేందుకు కొత్త రూల్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.