దగ్గితే చాలు కరోనా గుట్టు చెప్పేస్తోంది!

దగ్గితే చాలు కరోనా గుట్టు చెప్పేస్తోంది!

కరోనా పాజిటీవ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకోలా కూడా తెలుసుకునే అవకాశం ఉంది… అదేంటంటే, ఎవరైనా దగ్గేటప్పుడు వచ్చే శబ్దాన్ని విశ్లేషించడం ద్వారా ఆ వ్యక్తి కొవిడ్‌తో బాధపడుతున్నాడా? లేదా? అనే విషయం మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాదు వారు మాట్లాడే విధానాన్ని, ఊపిరి పీల్చుకునే విధానాన్ని విశ్లేషించడం ద్వారా కూడా ప్రజలు వ్యాధి బారిన పడ్డారో లేదో నిర్ణయించే సరికొత్త సాంకేతికతను ముంబయికి చెందిన వధ్వానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధి చేసింది.



https://10tv.in/walmart-drone-delivery-service-announced-for-grocery-and-household-products-in-the-expand-delivery-options/
ఈ సంస్థ కరోనా, సాధారణ దగ్గులకు సంబంధించి శబ్ద నమూనాలను సేకరించింది. ఏ శబ్దాలు కొవిడ్‌కు సంబంధముందో చెప్పే టూల్‌ను రూపొందించింది. దీనికి ఇప్పటికే అమెరికా నుంచి పేటెంట్‌ లభించిందని, ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్‌ బాధితులను కూడా ఈ టూల్‌ గుర్తించగలదని ఇన్‌స్టిట్యూట్‌ వారు చెప్పారు. దేశంలో 43శాతం ఎక్కువగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఈ టూల్‌ ఉపయోగపడుతోందని ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన పరిశోధకుడు రాహుల్‌ పణిక్కర్‌ చెప్పారు.


నార్వే ఇండియా భాగస్వామ్య కార్యక్రమం (ఎన్‌ఐపీఐ), డాక్టర్స్‌ ఫర్‌ యూ (డీఎఫ్‌వై), ఎయిమ్స్ జోధ్‌పుర్‌, గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ల భాగస్వామ్యంతో వధ్వానీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ పరిశోధన సాగించింది. ఇక ఇందులో భాగంగా బిహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, మహారాష్ట్రలకు చెందిన 3,621 మంది నుంచి శబ్ద నమూనాలను సేకరించి… వారిలో 2,041 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.