Dangerous Stunts : ప్రాణాలతో చెలగాటం… రన్నింగ్ ట్రైన్‌లో ప్రమాదకర విన్యాసాలు

పాపులారిటీ కోసమో మరో కారణమో తెలియదు కానీ.. కొంతమంది యువకులు చేసిన పని ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాళ్లకు పిచ్చి కానీ పట్టిందా అనే అనుమానాలు కలగక మానవు. రన్నింగ్ ట్రైన్ లో వాళ్లు చేసి

10TV Telugu News

Dangerous Stunts : పాపులారిటీ కోసమో సరదా కోసమో మరో కారణమో తెలియదు కానీ.. కొంతమంది యువకులు చేసిన పని ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాళ్లకు పిచ్చి కానీ పట్టిందా అనే అనుమానాలు కలగక మానవు. రన్నింగ్ ట్రైన్ లో వాళ్లు చేసిన ప్రమాదకర విన్యాసాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని తప్పుపడుతున్నారు.

Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు

వివరాల్లోకి వెళితే.. కదులుతున్న రైలులో కొందరు బాలురు ప్రమాదకర స్టంట్లు చేశారు. ఒక స్టేషన్‌ నుంచి కదిలిన రైలును పరిగెత్తుకుంటా వచ్చి కొందరు యువకులు ఎక్కారు. రైలు బోగి దగ్గర ప్రమాదకరంగా వేలాడారు. బోగి రాడ్‌ను చేతులతో పట్టుకుని కాళ్లను ఫ్లాట్‌ఫామ్‌పై ఉంచారు. ట్రైన్‌ స్టేషన్‌ దాటిన తర్వాత డేంజరస్‌ స్టంట్లు చేశారు. రైల్వే విద్యుత్‌ స్తంభాలను టచ్ చేస్తూ వెళ్లారు.

ఒకడు రైలు నుంచి ఒక చేతితో జంప్‌ చేస్తూ మరో చేతితో విద్యుత్‌ స్తంభాలను తాకాడు. ఒక చోట గోడ వంటిది రాగా రైలు నుంచి దానిపైకి దూకి పరుగెత్తి మళ్లీ రైలు బోగిలోకి చేరాడు. తర్వాత స్టేషన్ వచ్చే వరకు ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. అనంతరం ఆ బాలుర బృందం మరో స్టేషన్‌లో దిగి వెళ్లిపోయింది.

Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!

కాజ్ ఇంక్యులో అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ నెల 14న పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీకు అదనపు జీవితం ఉన్నప్పుడు.. అన్న క్యాప్షన్ తో అతడు దీన్ని ట్వీట్ చేశాడు. ఈ వీడియో నిమిషం నిడివి ఉంది. ప్రమాదకంగా స్టంట్లు చేసిన బాలుర తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో పలువురు ఇలాంటి విన్యాసాలు చేసి గాయపడటంతోపాటు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇంత జరిగినా ఇంకా కొందరిలో మార్పు రాకపోవడం విచారకరం అంటున్నారు.