Viral video: 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు.. సగం దూరం ఎక్కగానే..

20ఏళ్ల యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు.. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఎత్తైన డ్యామ్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు.. సగం దూరం వెళ్లగానే కాలు జారి కింద పడటంతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే పోలీసులకు ఈ విషయం తెలియడంతో సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. యువకుడు డ్యామ్ ఎక్కే వీడియోను చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు...

Viral video: 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు.. సగం దూరం ఎక్కగానే..

Karnataka's

Viral video: 20ఏళ్ల యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు.. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఎత్తైన డ్యామ్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు.. సగం దూరం వెళ్లగానే కాలు జారి కింద పడటంతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే పోలీసులకు ఈ విషయం తెలియడంతో సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. యువకుడు డ్యామ్ ఎక్కే వీడియోను చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యువకుడు డ్యామ్ ఎక్కుతూ ఒక్కసారిగా కిందపడటం ఆ వీడియోలో ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral video: దళితుడి నోట్లో ఆహారం తీసుకుని తిన్న కర్ణాటక ఎమ్మెల్యే.. కంగుతిన్న స్థానిక ప్రజలు

కర్నాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లా శ్రీనివాస సాగర డ్యామ్ 50 ఫీట్ల ఎత్తు ఉంటుంది. ఆ డ్యామ్ నుంచి సన్నటిపొరలా నీరు కిందకు జారుతుంది. చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూర్ తాలూకాకు చెందిన 20ఏళ్ల యువకుడు డ్యామ్ గోడను ఎక్కేందుకు ప్రయత్నించారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే డ్యామ్ ఎక్కేందుకు సన్నద్ధమయ్యాడు. స్థానికులు వారించినా వినిపించుకోకుండా సగం దూరం ఎక్కాడు. అక్కడి నుంచి ఒక్కసారిగా జారిపడటంతో యువకుడికి తీవ్రం గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించాయి. అయితే ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

శ్రీనివాససాగర డ్యాం గోడపై యువకుడు ఎక్కుతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ద్వారా చిత్రీకరించారు. యువకుడు డ్యామ్ గోడను సగందూరం ఎక్కిన జారిపడే సమయంలో స్థానికులు భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి రక్షణ లేకుండా ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ నెటిజర్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.