Youth loses life : ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ..రైలు ఢీకొని యువకుడు మృతి

సోషల్ మీడియాలో తన సరదా వీడియోలు పోస్ట్ చేయాలన్న ఓ యువకుడి ఫ్యాషన్ అతడి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్ లోని హోశంగాబాద్ జిల్లాలోని పంజర కలాన్ కు చెందిన సంజు చౌరేకి సోషల్ మీడియాలో

Youth loses life : ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ..రైలు ఢీకొని యువకుడు మృతి

Mp

Youth loses life :  సోషల్ మీడియాలో తన సరదా వీడియోలు పోస్ట్ చేయాలన్న ఓ యువకుడి ఫ్యాషన్ అతడి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్ లోని హోశంగాబాద్ జిల్లాలోని పంజర కలాన్ కు చెందిన సంజు చౌరేకి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. తరుచుగా తన సరదా వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఇటార్సీ లో రన్నింగ్ ట్రైన్ పక్కన నిలబడి వీడియో తీసి దానిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు.

ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో పట్టాలపై రైలు వస్తుండగా వీడియో తీయమని స్నేహితుడికి చెప్పాడు. అయితే రైలు మరీ దగ్గరగా వచ్చినా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీకొని తీవ్రగాయాలపాలైన సంజు చౌరేని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించగా..అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. శరద్​దేవ్​ ఆలయ దర్శనానికి వెళ్లిన వీరు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, అతని స్నేహితుడు, కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, సంజు చౌరే రైలు పట్టాల పక్కన నిలబడి వీడియోకి ఫోజులిస్తున్న సమయంలో రైలు అతడిని ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
ALSO READ Banjara Hills : బంజారాహిల్స్ లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం