Punjab: సీఎం కారును అడ్డుకున్న యువత

పంజాబ్ రోడ్లపై రాష్ట్ర సీఎం భగవంత్ మన్ రోడ్ షో నిర్వహిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంచుకుంది. ఇదిలా ఉంటే, రోడ్ షో మధ్యలో అతణ్ని అడ్డుకుని అగ్నిపథ్ స్కీం గురించి మాట్లాడాలని అడిగారు యువత. వీడియోలో పంజాబ్ సీఎం చేతులు యువత చేతులు పట్టుకున్నట్లుగా రికార్డ్ అయింది.

Punjab: సీఎం కారును అడ్డుకున్న యువత

Bhagawant Mann

 

 

Punjab: పంజాబ్ రోడ్లపై రాష్ట్ర సీఎం భగవంత్ మన్ రోడ్ షో నిర్వహిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంచుకుంది. ఇదిలా ఉంటే, రోడ్ షో మధ్యలో అతణ్ని అడ్డుకుని అగ్నిపథ్ స్కీం గురించి మాట్లాడాలని అడిగారు యువత. వీడియోలో పంజాబ్ సీఎం చేతులు యువత చేతులు పట్టుకున్నట్లుగా రికార్డ్ అయింది.

“అగ్నిపథ్ స్కీం స్టార్ట్ చేయడానికి ముందు లీడర్లంతా సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఎంపీల సమావేశం నిర్వహించినా పర్సనల్ గా వెళ్లేవాడిని” అని వివరించారు మన్.

ఇదే వీడియోను పోస్టు చేస్తూ అందుకే పంజాబ్ కు భగవంత్ మన్ అంటే అంత ప్రేమ అని ఆప్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది.

Read Also: వీఐపీల‌కు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేష‌న్‌ల‌కు పోలీసులు

సంగ్రూర్ ఉప ఎన్నికలకు ముందు రోడ్‌షో నిర్వహించారు మన్. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భగవంత్ మన్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన’అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. AAP కూడా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. హింసాత్మక నిరసనలను ఖండించింది.

AAP రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను “తక్షణమే” అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రస్తుత సంవత్సరానికి రక్షణ సేవలకు సాధారణ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరారు.