youtube నుంచి అభినందన్ వీడియోలు డిలీట్

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 02:27 AM IST
youtube నుంచి అభినందన్ వీడియోలు డిలీట్

వింగ్ కమాండర్ అభినందన్ వీడియోల గురించి సెర్చ్ చేస్తున్నారా ? అయితే మీకు ఆయన వీడియోలు కనిపించవు. ఎందుకుంటే యూ ట్యూబ్ వీడియోలను తొలగించేసింది. అభినందన్‌కు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ యూ ట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. యూట్యూబ్ స్వయంగా రంగంలోకి దిగింది. అన్ని ఫ్లాట్ ఫామ్స్ ల్లో అభినందన్ వీడియోలను తొలగించేసింది. లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్ నుంచి మాయం అయ్యాయి.

ఇండియా – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలను అందుకున్న యూ ట్యూబ్ యాజమాన్యం వింగ్ కమాండర్ అభినందన్‌కు సంబంధించిన వీడియోలను డిలీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము వీడియోలను తొలగించి గూగుల్ సర్వీసెస్‌ను అప్ డేట్ చేయడం జరిగిందని యూ ట్యూబ్ ప్రతినిధి వెల్లడించారు. వింగ్ కమాండర్ చిత్రాలు, వీడియోలు అడగవద్దని..ప్రజలు కూడా వీటిని సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచవద్దని ఇండియన్ మిలిటరీ అప్ డేట్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారతదేశం ప్రతికార చర్యలకు దిగింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు నిర్వహించాయి. ఫలితంగా పాక్ వాయుదళాలు భారతదేశాన్ని టార్గెట్ చేశాయి. పాక్ విమానాలను నేలకూల్చేసింది. ఈ ప్రయత్నంలో ఐఏఎఫ్ పైలట్ అభినందన్ పాక్ చేతికి చిక్కాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన్ను రిలీజ్ చేసేందుకు పాక్ ఒప్పుకుంది. ఆయన క్షేమంగా భారతదేశానికి వస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆయన చూపిన ధైర్య సాహసాలకు ప్రజలు సలామ్ కోడుతున్నారు.