YouTuber Bobby Kataria: యూట్యూబర్‌కు షాకిచ్చిన పోలీసులు.. అలా చేస్తే ఊరుకుంటారా మరి..

: యూట్యూబర్లు కొందరు పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. చట్టానికి లోబడి తమ పనులు నిర్వహించుకోవాల్సింది పోయి పబ్లిక్ ను డిస్టర్బ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే కోవలోనే యూట్యూబర్ బాబీ కటారియా హద్దులు దాటి ప్రవర్తించాడు.

YouTuber Bobby Kataria: యూట్యూబర్‌కు షాకిచ్చిన పోలీసులు.. అలా చేస్తే ఊరుకుంటారా మరి..

YouTuber Bobby Kataria

YouTuber Bobby Kataria: యూట్యూబర్లు కొందరు పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. చట్టానికి లోబడి తమ పనులు నిర్వహించుకోవాల్సింది పోయి పబ్లిక్ ను డిస్టర్బ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే కోవలోనే యూట్యూబర్ బాబీ కటారియా హద్దులు దాటి ప్రవర్తించాడు. నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ అడ్డొచ్చిన పోలీసులను సైతం బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పోలీసుల జోలికొస్తే ఊరుకుంటారా మరి.. యాక్షన్ కు సిద్ధమయ్యారు. కటారియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Dahi Handi: ఉట్టికొడితే రూ.55 లక్షలు.. స్పెయిన్ యాత్ర.. భారీ బహుమతులు ప్రకటించిన పార్టీలు

త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధానిలోని కాంట్ పోలీస్ స్టేషన్ జిల్లా కోర్టు నుండి కటారియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ పొందింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 342, 336, 290, 510, ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు. అతని అరెస్టు కోసం కాంట్ పోలీసుల బృందాలను హర్యానా, ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు ఎస్‌హెచ్ఓ రాజేంద్ర సింగ్ రావత్ తెలిపారు.

Gotabaya Rajapaksa: అమెరికానే కరెక్ట్.. అమెరికాలో స్థిరపడేందుకు గొటబయ రాజపక్సే ప్రయత్నాలు.. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు ..

28ఏళ్ల హర్యానా యూట్యూబర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రోడ్డుపై మద్యం తాగుతున్న వీడియోను అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో రోడ్స్ ఆప్నే బాప్‌కి (రోడ్లు మా నాన్నకు చెందినవి) అనే నేపథ్య పాటను కూడా ప్లే చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో.. హర్యానా డీజీపీ స్పందించారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు, చట్టవిరుద్ధం అంటూ విచారణకు ఆదేశించారు. ఆ వైరల్ వీడియో ఇప్పటికీ కటారియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఉంది. ఇది కాకుండా విమానంలో ధూమపానం చేస్తున్న కటారియా యొక్క వైరల్ వీడియో ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగస్టు 11 న ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని అన్నారు. అయితే విమానంలో ఉన్న వీడియో ఇప్పుడిది కాదని, 2019లో దుబాయ్ లో నా షూటింగ్ లో భాగమని కటారియా తెలిపాడు. అది డమ్మీ విమానమని పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Bobby Kataria (@katariabobby)