వివాదం ముగిసింది..రివ్యూ పిటిషన్ వేయం : సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్

వివాదం ముగిసింది..రివ్యూ పిటిషన్ వేయం : సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును ఈ రోజు(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సుప్రీం తీర్పుని అంగీకరిస్తున్నామని ఫరూకి తెలిపారు. సుప్రీం తీర్పుపై సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఎలాంటి రివ్యూకి వెళ్లదని,ఎటువంటి క్యూరేటివ్(నివారణ)పిటిషన్ వెయ్యమని తాను సృష్టం చేస్తున్నానని ఫరూకి తెలిపారు. సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.

అయోధ్య తీర్పుపై షియా న్యాయవాది మౌలానా కల్బే జావద్ మాట్లాడుతూ…సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. పెద్ద సంఖ్యలో ముస్లింలు సుప్రీం తీర్పుని అంగీకరించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను. వివాదం ఇప్పుడు ముగిసిపోయింది. ముస్లిం పర్శనల్ లా బోర్డు రివ్యూ పిటీషన్ ఫైల్ చేయాలని అనుకోవడంయ వాళ్ల హక్కు. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోవాలని తాను అనుకుంటున్నానని మౌలానా తెలిపారు.