Zee-Sony Merging: విలీనం దిశగా జీ-సోనీలకు అప్రూవల్

జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా బోర్డు డైరక్టర్లు ఒప్పందానికి వచ్చారు. అందులో 50.86శాతం వాటా సోనీ దక్కించుకుందని....

Zee-Sony Merging: విలీనం దిశగా జీ-సోనీలకు అప్రూవల్

Zee Sony

Zee-Sony Merging: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా బోర్డు డైరక్టర్లు ఒప్పందం ఖరారైంది. అందులో 50.86శాతం వాటా సోనీకి దక్కినట్లు బోర్డ్ కన్ఫామ్ చేసింది.

‘టీవీ కంటెంట్ డెవలప్మెంట్, బ్రాడ్‌కాస్టింగ్ ఆఫ్ రీజనల్, ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్మెంట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెల్స్, మూవీస్, మ్యూజిక్, డిజిటల్ బిజినెస్ లపై ఫోకస్ పెట్టింది. సంయుక్త సారథ్యంలో దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్మెంట్ నెట్‌వర్క్స్ గా మారింది’ అని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది.

సెప్టెంబర్ 22నే వీటి విలీనం గురించి ప్రకటించినప్పటికీ.. ప్రోసెస్ ముందుకు కదలడం కోసం జీ, సోనీలు 90రోజుల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ గడువు డిసెంబర్ 21తో పూర్తి అవడంతో.. జీతో సోనీ కలుస్తున్నట్లు అధికారిక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా పునీత్ గోయంకాను ఎండీ, సీఈఓగా అపాయింట్ చేస్తున్నట్లు తెలిపారు.

……………………………….. : అక్రమ ఫ్లెక్సీకి రూ. లక్ష జరిమానా

వ్యాపారపరంగానే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ రీత్యా ఈ విలీనం అద్భుతాలను సృష్టిస్తుందని మేనేజ్మెంట్ చెప్తుంది. ఫలితంగా ఇండియాలో 26శాతం వ్యూయర్‌షిప్ సంపాదించగలదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.