Jyaotiraditya Scindia: అలాంటి ఘటనలను సహించేది లేదు: ఇండిగో విమాన సిబ్బంది చర్యలకు ఆదేశించిన కేంద్ర మంత్రి

విమానం ఎక్కేందుకు వచ్చిన వికలాంగ బాలుడిని, అతని తల్లిదండ్రులను విమానంలోకి అనుమతించకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి

Jyaotiraditya Scindia: అలాంటి ఘటనలను సహించేది లేదు: ఇండిగో విమాన సిబ్బంది చర్యలకు ఆదేశించిన కేంద్ర మంత్రి

Indigo

Jyaotiraditya Scindia: విమానం ఎక్కేందుకు వచ్చిన వికలాంగ బాలుడిని, అతని తల్లిదండ్రులను విమానంలోకి అనుమతించకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..ఇండిగో విమాన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..రాంచి ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఒక వికలాంగ బాలుడిని అతని తల్లైదండ్రులను ఇండిగో విమాన సిబ్బంది అడ్డుకున్నారు. చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న ఆ బాలుడిని విమానంలో ఎక్కించేది లేదంటూతేల్చి చెప్పారు. గంట పాటు కారులో ప్రయాణించి అసౌకర్యంగా ఉండడంతో విమానం ఎక్కలేనంటూ బాలుడు గొడవ చేస్తున్నాడు. దీంతో బాలుడిని బుజ్జగించిన తల్లిదండ్రులు ఎలాగోలా విమానం ఎక్కించేందుకు ఒప్పించారు. అయినా చక్రాల కుర్చితో బాలుడిని విమానంలోకి ఎక్కిస్తే తిప్పలు తప్పవంటూ ఇండిగో సిబ్బంది ఆ తల్లిదండ్రులను అవమానపరిచారు.

Also read:Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు

దీంతో పక్కనే మరికొందరు ప్యాసింజర్లు కలగజేసుకుని బాలుడిని అతని తల్లిదండ్రులను విమానంలోకి ఎక్కించాలంటూ విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇండిగో స్థానిక మేనేజర్..చక్రాల కుర్చీలో ఉన్న బాలుడిని విమానం ఎక్కించడం కుదరదని..అందులోనూ ఆ పిల్లవాడి ప్రవర్తన తాగుబోతులా ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. అనంతరం సదరు కుటుంబాన్ని ఎక్కించుకోకుండానే విమానం హైదరాబాద్ బయలుదేరింది. ఈఘటనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన మరొక ప్యాసింజర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు ట్యాగ్ చేశారు.

Also read:Threat Letter: ఉత్తరాఖండ్‌లో రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేల్చివేస్తామంటూ లేఖ: 20 ఏళ్లుగా లేఖలు వస్తూనే ఉన్నాయన్న పోలీసులు

ఈ ఘటనపై సోమవారం స్పందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..ఘటనపై విచారణకు ఆదేశించారు. “మనుషుల్లో ఎవరికీ ఇటువంటి దురదృష్ట ఘటన ఎదురు కాకూడదు. ఈ ఘటనను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. భాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ట్వీట్ చేశారు సింధియా. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విమాన సంస్థ ఇండిగో వివరణ ఇచ్చుకుంది. అప్పటికే కొంత భయంతో ఉన్న బాలుడు విమానం ఎక్కేందుకు మరింత బయపడ్డాడని, షింటో అతన్ని శాంత పరిచేందుకు తమ సిబ్బంది చివరి నిమిషం వరకు ప్రయత్నించారని, ఆలస్యం అవడంతో బాలుడిని అతని తల్లిదండ్రులను మరో విమానంలో పంపించినట్లు ఇండిగో ప్రకటించింది.

Also read:Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు