Fitness : జీరోదా బంఫర్ ఆఫర్.. ఇలా చేస్తే నెల జీతం బోనస్

జాబ్ అంటే పనిపై దృష్టిపెట్టడం ఒక్కటే కాదు.. శారీరకంగా కూడా దృడంగా ఉండాలి. లేదంటే అనేక సమస్యలు వచ్చిపడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జీరోదా కంపెనీ ఓ ఛాలెంజ్ తీసుకొచ్చింది.

Fitness : జీరోదా బంఫర్ ఆఫర్.. ఇలా చేస్తే నెల జీతం బోనస్

Fitness

Fitness : కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు పనిని టార్గెట్ గా ఇవ్వడమే కాదు.. మానసిక ఆందోళన దరిచేరకుండా ఉండేందుకు యోగ, వ్యాయామం వంటివి చేయాలనీ సూచిస్తారు. కొన్ని కంపెనీలు కార్యాలయంలోనే జిమ్, యోగ సెంటర్లు ఏర్పాటు చేస్తాయి. శారీరకంగా దృడంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జీరోదా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులకు సరికొత్త ఛాలెంజ్ విసిరింది. ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాలని తెలిపింది. ఉద్యోగులు ఫిట్‌గా ఉండడం కోసం సరికోత్త ఛాలెంజ్‌ను కంపెనీ విసిరింది. ఛాలెంజ్‌లో భాగంగా ఏడాది కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నప్రతి ఉద్యోగికి ఒక నెల జీతాన్ని బోనస్‌గా అందించనుంది. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఉద్యోగికి రూ.10 లక్షల బోనస్ ఇవ్వనుంది.

కరోనా కారణంగా చాలామంది ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటినుంచి వర్క్ చేస్తూ ఉండటంతో, వ్యాయామంపై దృష్టిపెట్టలేకపోయారు. దీంతో చాలామంది బరువు పెరిగారు. బాడీ స్ట్రక్చర్ కూడా మారిపోయింది. తిరిగి పూర్వస్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే జీరోదా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దీని బాటలోనే మరికొన్ని కంపెనీలు పయనించే అవకాశం లేకపోలేదు.

ఇదే అంశంపై జీరోదా కంపెనీ సీఈవో నితిన్‌ కామత్‌ మాట్లాడారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు.
ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్‌ కామత్‌ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగుల జీవనా విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్‌ కామత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన వారికి ఒకనెల జీతం బోనస్ అని తెలిపారు.