Zomato: జొమాటో డెలివరీ భాగస్వాములకు గుడ్‌న్యూస్ .. సంచలన నిర్ణయం ప్రకటించిన సీఈఓ

జొమాటో డెలివరీ భాగస్వాములకు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ గుడ్ న్యూస్ చెప్పారు. ఐదేళ్లుగా సంస్థలో డెలివరీ భాగస్వాములగా పనిచేసే వారి పిల్లల చదువుల కోసం భారీగా...

Zomato: జొమాటో డెలివరీ భాగస్వాములకు గుడ్‌న్యూస్ .. సంచలన నిర్ణయం ప్రకటించిన సీఈఓ

Zomato Ceo Goyal

Zomato: జొమాటో డెలివరీ భాగస్వాములకు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ గుడ్ న్యూస్ చెప్పారు. ఐదేళ్లుగా సంస్థలో డెలివరీ భాగస్వాములగా పనిచేసే వారి పిల్లల చదువుల కోసం భారీగా విరాళాన్ని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. జొమాటో పబ్లిక్ లిస్టింగ్ లోకి వెళ్లడం కంటే ముందు దీపిందర్ గోయల్ పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయనకు  కొన్ని ఈఎస్ఓపీ (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్) లను ఇచ్చాయి. వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడంతో ఆ షేర్లను గోయల్ విక్రయించనున్నారు.

Zomato 10Min Delivery : ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా చేస్తారో మాకు చెప్పాలి’ ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు

గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం ఈ ఈఎస్ఓపీల విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 700 కోట్లు ఉంటుంది.. అయితే ఈ షేర్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని జొమాటో ప్యూచర్ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ మొత్తాన్ని జొమాటోలో పనిచేసే సిబ్బంది, డెలివరీ భాగస్వాముల పిల్లలకు వినియోగిస్తానని తెలిపారు. గోయల్ ప్రకటించిన నిబంధనల ప్రకారం.. ఐదేళ్లు జొమాటోలో డెలివరీ భాగస్వాములుగా పనిచేస్తున్నట్లయితే వారి పిల్లల చదువుకోసం ఏడాదికి రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.

Zomato Delivery: పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ? జొమాటోకు ఇది ఎలా సాధ్యం?

ఒకవేళ సదరు ఉద్యోగి కంపెనీలో 10ఏళ్లు పూర్తిచేసుకున్నట్లయితే వారి పిల్లల చదువుకోసం ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు గోయల్ ప్రకటించారు. అదేవిధంగా మహిళా డెలివరీ భాగస్వాములకు సర్వీసు నిబంధన ఇంతకంటే తక్కువేనని గోయల్ వెల్లడించారు. అంతేకాదు.. డెలివరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవ శాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని, ఇందుకుగాను సర్వీసుతో సంబంధం లేదని గోయల్ ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో గోయల్ పేర్కొన్నారు.