Zomato Share : తారాజువ్వలా దూసుకెళ్లిన Zomato షేర్లు

తొలిసారి స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టయిన Zomato షేర్లు తారాజువ్వలా దూసుకపోతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేర్ ధర BSEలో రూ. 115 వద్ద ప్రారంభమైంది. ఉదయం 10.17గంటల సమయంలో బీఎస్ఈలో Zomato షేరు ధర రూ. 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడవుతోంది.

Zomato Share : తారాజువ్వలా దూసుకెళ్లిన Zomato షేర్లు

Zomato

Zomato Share : తొలిసారి స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టయిన Zomato షేర్లు తారాజువ్వలా దూసుకపోతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేర్ ధర BSEలో రూ. 115 వద్ద ప్రారంభమైంది. ఉదయం 10.17గంటల సమయంలో బీఎస్ఈలో Zomato షేరు ధర రూ. 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో రూ. 138 వరకు ఎగబాకి అప్పర్ సర్క్యూట్ ను తాకింది. మార్కెట్ క్యాపిటలైజెషన్ రూ. 1,08,067.35 కోట్లను దాటింది.

Read More : Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

ప్రారంభంలోనే బీఎస్ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారడం విశేషం. IPO ధర రూ. 76తో పోలిస్తే…51.32 శాతం ప్రీమియంతో నమోదైంది. ఇక SSEలో 19.41 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా BSEలో టాప్ 50 జాబితాలో Zomato చేరడం గమనార్హం. జొమాటో షేర్ల విషయానికి వస్తే…దీనికి సంబంధించిన షేర్లు 27వ తేదీన నమోదు కావాల్సి ఉంది. ముందుగానే స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టయింది. రూపాయి విలువ కలిగిన షేరును రూ. 75 ప్రీమియంతో రూ. 76 చొప్పున కంపెనీ కేటాయించింది. 2020 మార్చి తర్వాత (SBI CARDS రూ. 10,341 కోట్లు) అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇదేనని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read More : Bharath : 35 ఏళ్లకే 11% మందికి ఏదో ఒక రోగం..ఆందోళనలో ఆరోగ్యం

ఇదిలా ఉంటే..లిస్టింగ్ అయిన సమయానికి కంటే ముందు…జొమాటో వ్యవస్థాపకుడు వాటాదార్లకు లేఖలు రాశారు. జొమాటోతో పాటు మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదగనున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత పదేళ్ల ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, రానున్న పదేళ్లు ఆపై దృష్టి సారించనున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్‌లో మొదటి కంపెనీ లిస్ట్ కావడం, మార్కెట్ సెంటిమెంట్ పాజిటీవ్‌గా ఉండటం దీనికి కారణమని బిజినెస్ విశ్లేషకులు వివరిస్తున్నారు. అంతేగాకుండా ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ ఉండటం, మార్కెట్ షేర్ స్థిరంగా పెరుగుతూ ఉండటం లాంటి కారణాలతో ఈ సంస్థకు చెందని షేర్లు జోరు కొనసాగించాయని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం జొమాటోకు 3,89,932 యాక్టివ్ రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా.