Zomato – Swiggy: కొత్త నిబంధనలు అమల్లోకి.. ఫుడ్ సర్వీసులు రాత్రి 8కే బంద్

రాత్రి 8గంటలు దాటితే జొమాటో, స్విగ్గీ సర్వీసులు ఆర్డర్లు తీసుకోకూడదని నిబంధనలు విధించింది మహారాష్ట్ర..

Zomato – Swiggy: కొత్త నిబంధనలు అమల్లోకి.. ఫుడ్ సర్వీసులు రాత్రి 8కే బంద్

Zomato Swiggy

Zomato – Swiggy: రాత్రి 8గంటలు దాటితే జొమాటో, స్విగ్గీ సర్వీసులు ఆర్డర్లు తీసుకోకూడదని నిబంధనలు విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో రాత్రి సమయాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు అవుతుండటంతో ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్ ల గురించి యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

జొమాటోలో.. మేం ప్రస్తుతం ఆన్ లైన్ ఆర్డర్లు అంగీకరించడం లేదు. కొద్ది కాలం తర్వాత సర్వీసు మొదలవుతుందని డిస్ ప్లే అవుతుంది. స్విగ్గీలో.. మేం ప్రస్తుతం ఈ ప్రాంతంలో డెలివరీ చేయలేకపోతున్నాం అని వస్తుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ గైడ్ లైన్స్ అమలు చేసినప్పటి నుంచి ఈ మార్పు తెరపైకి వచ్చింది. ఇప్పటికే డైలీ కేసుల సంఖ్య 47వేలకు దాటింది. ఆదివారం ఏప్రిల్ 4న నమైదన కేసులు 11వేలుగా ఉన్నాయి. ముందుగా వారంతాల్లో నైట్ లాక్ డౌన్ అని చెప్పినా.. ఇప్పుడు ప్రతి రోజూ నైట్ లాక్ డౌన్ అమలు చేస్తుంది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే జొమాటో, స్విగ్గీ సర్వీసులు కూడా అదే టైంలోనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలా ఏప్రిల్ 30 వరకూ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. టేక్ ఎవే ఆర్డర్లు, హోమ్ డెలివరీ సర్వీసులు కేవలం ఉదయం 7గంటల నుంచి రాత్రి 8వరకే తీసుకుంటామని రెస్టారెంట్లు చెప్తున్నాయి.