ZyCov-D Vaccine : మూడు డోసుల పిల్లల కోవిడ్ వ్యాక్సిన్ ధర రూ.1900!

12 ఏళ్ల్లు దాటిన వారి కోసం జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ సిద్ధం చేసిన మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ "జైకొవ్‌-డి" ​ధరకి సంబంధించి  కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది జైడస్ సంస్థ.

ZyCov-D Vaccine : మూడు డోసుల పిల్లల కోవిడ్ వ్యాక్సిన్ ధర రూ.1900!

Zydus

ZyCov-D Vaccine    12 ఏళ్ల్లు దాటిన వారి కోసం జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ సిద్ధం చేసిన మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ “జైకొవ్‌-డి” ​ధరకి సంబంధించి  కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది జైడస్ సంస్థ. వ్యాక్సిన్ మూడు డోసులకు కలిపి రూ.1900 వసూలు చేయాలని భావిస్తున్నట్లు కేంద్రానికి జైడస్ క్యాడిలా తెలిపింది. అయితే ఈ ధర తగ్గింపుపై జైడస్ క్యాడిలా కంపెనీతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ గురువారం తెలిపారు. కేంద్రం మరియు కంపెనీ మధ్య ధరకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు మూడు రౌండ్ల చర్చలు జరిగాయని.. వ్యాక్సిన్​ ధరకు సంబంధించి ఈ వారంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. జైకొవ్​-డి వ్యాక్సిన్​కు ఉపయోగించే సూది రహిత జెట్ ఇన్​జెక్టర్​ ధరే రూ.30వేలు ఉంటుందని.. అందుకే కొవాగ్జిన్, కొవిషీల్డ్​ కన్నా ఎక్కువ ధరను సంస్థ ప్రతిపాదించిందని ఓ అధికారి తెలిపారు.

కాగా, జైకొవ్‌-డి వ్యాక్సిన్‌ దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో వ్యాక్సిన్. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే. ఇది సూది రహిత వ్యాక్సిన్. ఫార్మాజెట్‌ అనే సాధనం ద్వారా ఈ వ్యాక్సిన్ ను నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. వ్యాక్సిన్​ కోసం జైడస్​ రూపొందించిన ఈ జెట్​ ఇన్​జెక్టర్​ ద్వారా 20వేల డోసులు అందించొచ్చు. ఈ వ్యాక్సిన్ మూడు విడతల కింద 0, 28, 56 రోజులకు తీసుకోవాలి.

కాగా, వ్యాక్సిన్ డ్రైవ్ లో “జైకొవ్‌-డి” ని ప్రవేశపెట్టడానికి మరియు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 12-18 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వడానికి జాతీయ సాంకేతిక ఇమ్యునైజేషన్ గ్రూప్ (NTAGI) నుండి సిఫార్సుల కోసం కేంద్ర ఆరోగ్యశాఖ ఎదురుచూస్తోంది. అయితే, ఈ ఏడాది ఆగస్టులో డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) జైడస్​ క్యాడిలా వ్యాక్సిన్​.. అత్యవసర వినియోగానికి అనుమతించింది. పెద్దలకు, 12 ఏళ్లు దాటిన పిల్లల కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మరోవైపు, పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి…దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి,కొవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నేషనల్​ ఇమ్యూనైజేషన్ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే అరోడా చెప్పారు.

ALSO READ తాలిబన్ కు ఉన్న హక్కు నాకు లేదా..కోర్టుకెక్కిన ట్రంప్