Zydus Cadila: మూడు చుక్కల్లో కొవిడ్ వ్యాక్సిన్.. అప్రూవల్ కోసం జైడస్ ఎదురుచూపులు

కరోనావైరస్ సెకండ్‌వేవ్ ఉధృతి సమయంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యత అర్థమైంది. దీంతో లోకల్ మ్యాన్యుఫ్యాక్చరర్ భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవీషీల్డ్ లకు మాత్రమే అప్పటికే ఆమోదం దొరకడంతో దేశవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి.

Zydus Cadila: మూడు చుక్కల్లో కొవిడ్ వ్యాక్సిన్.. అప్రూవల్ కోసం జైడస్ ఎదురుచూపులు

Covid Vaccine (2)

Zydus Cadila: కరోనావైరస్ సెకండ్‌వేవ్ ఉధృతి సమయంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యత అర్థమైంది. దీంతో లోకల్ మ్యాన్యుఫ్యాక్చరర్ భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవీషీల్డ్ లకు మాత్రమే అప్పటికే ఆమోదం దొరకడంతో దేశవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి. అదే సమయంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) స్పుత్నిక్ వీ, మోడర్నా వ్యాక్సిన్ లకు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ఇచ్చేసింది.

ఇప్పుడు అహ్మదాబాద్ కు చెందిన జైడస్ కాడిలా తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ కు అప్రూవల్ రావాలని ఎదురుచూస్తున్నాయి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంజక్షన్ కాదు. కేవలం మూడు చుక్కలు వేసి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవచ్చు.

ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్
ZyCoV-D ఒక ప్లాస్మైడ్ డీఎన్ఏ వ్యాక్సిన్. ఇది డీఎన్ఏ మాలిక్యుల్ నాన్ రిప్లేకేటింగ్ వెర్షన్. స్పైక్ ప్రొటీన్ కు హాని తలపెట్టకుండా SARS-COV2తో పోరాడుతుంది. అంతేకాకుండా దీనిని థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్ అని కూడా అంటున్నారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే వ్యాక్సిన్లలో డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ గా.. సంప్రదాయ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ బెనిఫిట్ గా కనిపిస్తుంది. వ్యాక్సిన్ సామర్థ్యం మెరుగు చేయడంతో పాటు ఇన్ఫెక్చువస్ ఏజెంట్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని ఎక్కువ మొత్తంలో తయారుచేయడానికి ఎక్కువ వీలుంటుంది.

మూడు చుక్కలుగా వ్యాక్సిన్
రిపోర్టుల ప్రకారం.. ఫేజ్ 3 ట్రయల్స్ లో 12-18 ఏళ్ల మధ్య వయస్సున్న 28వేల వాలంటీర్లు పాల్గొన్నారు. ఇతర కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరి కాకుండా ZyCOV-D మూడు చుక్కల్లోనే వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కాకపోతే ఇది మూడు డోసుల్లో తీసుకోవాలి. డే 0, డే 28, డే 56వ రోజు తీసుకోవాల్సి ఉంటుంది.