Zydus Cadila vaccine : త్వరలోనే 12-18ఏళ్ల వారికి కోవిడ్ వ్యాక్సిన్

12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Zydus Cadila vaccine : త్వరలోనే 12-18ఏళ్ల వారికి కోవిడ్ వ్యాక్సిన్

Centre

Zydus Cadila vaccine 12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 12-18ఏళ్ల వారికి వ్యాక్సిన్ కు సంబంధించి జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ జరుపుతున్న ట్రయిల్స్ దాదాపు పూర్తి అయ్యాయని,ఇది చట్టబద్ధమైన అనుమతులకు లోబడి ఉంటుందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది.

నిపుణుల సంస్థ అనుమతులు ఇవ్వగానే 12-18ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంబంధించి ఓ పాలసీని తీసుకురానున్నట్లు కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ ఢిల్లీ హైకోర్టుకి తెలిపారు. మరోవైపు, 2-18 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వడం కోసం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను వాలంటీర్లపై పరీక్షల చేసేందుకు డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇంియా) మే 12న అనుమతిచ్చిందని కేంద్రం తెలిపింది.

కాగా, ఢిల్లీలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌లో 12 నుంచి 18 ఏళ్ల లోపు వారిని చేర్చాలా ఆదేశించాలని కోరుతూ తన తల్లిద్వారా 12 ఏళ్ల పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడున్న ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. పిల్లల వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురు చూస్తోందని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేంద్రానికి మరింత సమయం ఇస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది కోర్టు.

కాగా, జైడ‌స్ క్యాడిలా టీకాల‌ను 12-18 పిల్ల‌ల‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. డీసీజీఐకి చెందిన‌ స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ(ఎస్ఈసీ) జైడ‌స్ డేటాను ప‌రిశీలించ‌నుంది. అయితే ట్ర‌య‌ల్స్ డేటా ప‌ట్ల ఒక‌వేళ ప్ర‌భుత్వం స‌ముఖంగా ఉంటే, ఆ కంపెనీ టీకాకు వెంట‌నే అత్య‌వ‌స‌ర వినియోగం కింద అనుమ‌తి ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఓ అధికారి తెలిపారు. ఒక‌వేళ అనుమ‌తి ద‌క్కితే, ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో టీకాల స‌ర‌ఫ‌రా మొద‌ల‌వుతుంద‌ని తెలిపారు.