కీర్తి సురేష్ సినిమా కాంట్రవర్శీ.. నట్టి కుమార్ vs చంటి అడ్డాల..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిర్మాత నట్టి కుమార్ మీద బంజారాహిల్స్ పిఎస్‌లో కేసు నమోదు చేసిన చంటి అడ్డాల..

Keerthy Suresh: ‘‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా నా దగ్గర సినిమా కొని డబ్బులు ఇవ్వలేదు. చెక్కులు ఇచ్చి, ఇప్పుడే ప్రొసీడ్ అవొద్దన్నాడు. ఫిల్మ్ ఛాంబర్‌లో నట్టి కుమార్ మీద ఫిర్యాదు చేశాను. మా మధ్య చేసుకున్న అగ్రిమెంట్‌ను కూడా ఫిల్మ్ ఛాంబర్ క్యాన్సిల్ చేసింది.
అయినా కూడా నిర్మాతగా నా పేరు తీసేసి అతని పేరు వేసుకున్నాడు.. నేను రిలీజ్ చేసిన పోస్టర్ అతనిదిలా క్రియేట్ చేశాడు.

ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాకా కూడా నా సినిమాను తన సినిమాగా చెప్పుకుంటున్నాడు. నట్టి కుమార్ అనే ఫ్రాడ్‌ను నమ్మడమే నేను చేసిన తప్పు. పోలీసులు నట్టి కుమార్ మీద యాక్షన్ తీసుకోవాలి’’ అన్నారు.


నేను ఎవరినీ మోసం చేయలేదు- నట్టి కుమార్

నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్, ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వు’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్‌లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేశాను.


సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేశాడు. ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్‌గా ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ చంటి అడ్డాల మాత్రం హాలీ ఇన్‌ఫ్లూయెన్స్ చేసి నామీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను కూడా అతనిపై ఫిర్యాదు చేశా. పోలీసులపైనా, న్యాయస్థానాలపైనా నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా’.. అన్నారు.

Related Posts