Natural Star Nani JERSEY Official Teaser-10TV

నానీ జెర్సీ మూవీ టీజర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, జెర్సీ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

నేచురల్ స్టార్ నాని, మళ్ళీ రావా సినిమా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ, జెర్సీ.. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.  నూతన సంవత్సరం సందర్భంగా, జెర్సీ నుండి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, జెర్సీ టీజర్ రిలీజ్ చేసింది.  
నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్, అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుండి రిటైరయ్యే ఏజ్ అని అర్జున్‌ని ఉద్దేశిస్తూ, ఒక వ్యక్తి చెప్పే వాయిస్ ఓవర్‌తో జెర్సీ టీజర్ స్టార్ట్ అవుతుంది. పిల్లలని ఆడించే వయసులో మనకీ ఆటలెందుకు బావా అంటూ, మరో క్యారెక్టర్ కూడా అర్జున్‌ని ఆవేదనని అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది.

 

ఎన్ని అడ్డంకులెదురైనా, పనికిరావు పొమ్మన్నా, కిందపడ్డా, తిరిగి పైకిలేచి  తను అనుకున్నది సాధించే ఆటగాడిగా నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడనేది టీజర్ చూస్తే తెలుస్తుంది.  అర్జున్ కొట్టిన బాల్, స్టేడియం బయట పార్క్ చేసి ఉన్న కార్ గ్లాస్‌కి తగిలే షాట్ చాలా బాగుంది. ఆపేసి ఓడిపోయిన వాడున్నాడు కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు అంటూ టీజర్ చివర్లో నాని చెప్పిన డైలాగ్ బాగుంది. సంజు జాన్ వర్గీస్ కెమెరా వర్క్, అనిరుధ్ ఇచ్చిన ఆర్ఆర్ బాగున్నాయి. 2019 ఏప్రిల్‌లో రిలీజ్ కానున్నఈ సినిమాకి ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).

వాచ్ టీజర్…

Related Posts

ఇలియానా బాడీ బ్యూటీఫుల్, శ్రీముఖి క్యూట్ నెస్.. శ్రద్ధాశ్రీనాధ్ బోల్డ్ నెస్.. సుమ కొత్త ప్రొగ్రామ్ టీజింగ్.. సొంతూరిలో కంగనా పూజలు.. తేజస్వీ లేటెస్ట్ ఫ్యాషన్ టెక్నిక్స్.. మంచు లక్ష్మి.. జస్ట్….వావ్…