ప్రపంచంలో ఏయే దేశాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Navratri Celebrations : నవరాత్రి ఉత్సవాలు ఒక భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ సాంప్రదాయ నృత్యాలతో పండగ జరుపు కుంటుంటారు. భారతదేశంలోని గుజరాతీలు ప్రపంచ దేశాలకు ఎక్కడికెళ్లినా నవరాత్రి ఉత్సవాల సమయంలో గార్బా బీట్స్, దాండియా వంటి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తుంటారు.

ప్రపంచ దేశాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, లండన్, కెనడా, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, సింగపూర్ వంటి దేశాల్లోనూ భారతీయులంతా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏయే దేశాలు ఉత్సవాలను జరుపుకుంటున్నాయో చూద్దాం..

ఆస్ట్రేలియా :
ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. బ్రిస్బేన్ వంటి కొన్ని నగరాల్లో సాయంత్రం సమయాల్లో డాన్సులతో సందడిగా కనిపిస్తున్నాయి. మెల్ బోర్న్ లోనూ ఇండియా మాదిరిగా సాంప్రదాయ పద్ధతితో నవరాత్రులను జరుపుకుంటున్నారు.

ఆఫ్రికా :
అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు కంపాలాలోని నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ భారతీయ కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువ జనాభా నివసిస్తోంది. ప్రతి ఏడాదిలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

కంపాలాలో లోహనా సామాజ్, పాటిదార్ సామాజ్ నిర్వాహకులు వివిధ గార్భా ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. భారతదేశం నుంచి ఆర్టిస్టులను ఆహ్వానించి నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

న్యూజిలాండ్ :
గత ఆగస్టులోనే అక్లాండ్‌లో నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇండియా నుంచి వచ్చిన అచల్ మెహతా ఆర్టిస్టును ఆహ్వానించి ఉత్సవాలను సెలబ్రేట్ చేశామని మైత్రీ త్రివేది నిర్వాహకులు చెప్పారు. గతవారమే వెల్లింగ్టన్‌లో గార్భా నైట్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు.

వాస్తవానికి గార్భా నైట్స్ ఈవెంట్ సెప్టెంబర్ 30 నుంచే మొదలయ్యాయి. ఈవెంట్లో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తికి 10 డాలర్లు చెల్లించాలన్నారు. భారత దేశంలో మాదిరిగానే ఇక్కడి ఈవెంట్ టికెట్ ధరలు కాస్తా తక్కువగానే ఉంటాయని త్రివేది చెప్పారు.

లండన్ :
లండన్ నగరంలో ప్రత్యేకించి నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు. ప్రతి కమ్యూనిటీ సెంటర్ ఒక గార్బా ఈవెంట్ నిర్వహిస్తుంటోంది. సౌత్ వింబ్ లెడన్ కమ్యూనిటీ సెంటర్, కింగ్స్ బరీ గ్రీన్ ప్రైమరీ స్కూల్, హారో లిజియర్ సెంటర్, సుద్ బరీ ప్రైమరీ స్కూల్ వెంబ్లే, బ్రాహ్మిణ్ సొసైటీ నార్త్ లండన్ వంటి ఎన్నో కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్భా ఈవెంట్లను హోస్ట్ చేస్తుంటామని హెటా భట్ అనే నిర్వాహకులు తెలిపారు.

READ  ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్‌ లేదు

కెనడా :
ప్రతి ఏడాదిలో నవరాత్రి ఉత్సవాలను టొరెంటోలో NRGలు ప్రత్యేకమైన తేదీల్లో జరుపుకుంటారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఇంకా ప్రకటించలేదని అక్కడి ధావన్ భరద్వాజ్ అనే నివాసి చెప్పారు. కానీ, నగరంలోని భారతీయ అసొసేషన్ అంతా కలిసి షేరి గార్బాను సెలబ్రేట్ చేసుకోబోతున్నామని తెలిపారు. టొరొంటోలో సెప్టెంబర్ 25న అతుల్ పురోహిత్ ఆధ్వర్యంలో గార్బా ఈవెంట్ నిర్వహించామని చెప్పారు.

కాలిఫోర్నియా :
ప్రతి ఏడాదిలో నవరాత్రి ఉత్సవాలకు భారత్ నుంచి ప్రత్యేకమైన డాన్స్ ట్రూప్ కాలిఫోర్నియాకు సందర్శిస్తుంటుందని మితుల్ పరేఖ్ తెలిపారు. ఇండియన్స్ నివసించే పలు ప్రాంతాల్లో గార్బా నైట్స్ ఈవెంట్లను నిర్వహిస్తామని అందులో ఇండియన్స్ అందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది కూడా ప్రీతి, పింకీ అనే ఇద్దరు NRIలు డాన్స్ ఈవెంట్లలో పాల్గొంటారని పేర్కొన్నారు.

గుజరాతీ కల్చరల్ అసొసియేషన్ ఆఫ్ బే ఏరియా నవరాత్రి నైట్స్ నిర్వహిస్తుంటోంది. అక్టోబర్ 1, 7,8, 14, 15 తేదీల్లో గార్బా ఈవెంట్లకు తేదీలను కూడా ఫిక్స్ చేసేశారు. వికెండ్ లలో అయితే అందరూ పాల్గొనేందుకు వీలుగా ఉంటుందని ఈ తేదీలను ఫిక్స్ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు.

న్యూయార్క్ :
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా ఈవెంట్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. జెర్సీ సిటీలోని ఓ స్టేడియంలో అతిపెద్ద గార్బా ఈవెంట్ నిర్వహించారు. దీనికి అతుల్ పురోహిత్ మ్యూజిషియన్ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి ఏడాదిలో దేవాంగ్ పటేల్ ప్రదర్శన ఇచ్చేందుకు వస్తుంటారు. భారతదేశంలో జరిగే నవరాత్రి ఉత్సవాల మాదిరిగానే న్యూయార్క్ లో కూడా నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.

న్యూజెర్సీ :
భారతదేశంలో నవరాత్రి ఉత్సవాలకు న్యూజెర్సీలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఒకటే తేడా ఉంది.. న్యూజెర్సీలో నవరాత్రి ఉత్సవాలు రాత్రి 2 గంటల వరకు జరుగుతాయని షాయివా పాండ్యా అనే విద్యార్థి చెప్పాడు. నవరాత్రి నెలల్లో అనేక గార్బా ఈవెంట్లు నిర్వహిస్తారని చెప్పాడు. వారాంతాల్లోనే నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని తెలిపాడు. Newark avenue అనే ఒక భారతీయ స్ట్రీట్ ఉంటుంది.. ఇక్కడ ఎక్కువగా గుజరాతీలు నివసిస్తుంటారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రత్యేకమైన రోజుల్లో ఈ వీధులన్నీ ఉత్సవాలతో సందడిగా నిండిపోతాయి.

సింగపూర్ :
నవరాత్రి ఉత్సవాల సమయంలో గార్బా ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. Sengkang Community Center, Anchorvale Community Center అనే రెండు వేదికలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా గార్బా నైట్స్ ఈవెంట్లు జరుపుకుంటున్నారు. భారతీయ ఆర్టిస్టులు ఎక్కువగా ప్రదర్శనిచ్చేది కూడా ఇక్కడే. గుజరాతీ అసొసియేషన్ నిర్వహించే గార్బా ఈవెంట్లలో 300 నుంచి 400 మంది భారతీయులు పాల్గొంటారు. బెంగాల్, పంజాబ్ సహా ఇతర భారత రాష్ట్రాలకు చెందిన చాలామంది భారతీయులంతా కలిసి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు.

READ  డ్రగ్స్ దందాకు కేంద్రంగా మారిన ముంబై.. ఎన్సీబీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

Related Posts