లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నయనతార క్రేజ్ మరింత పెంచే రెండు సినిమాలు!

Published

on

Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్.. స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం Netrikann – (నెట్రికన్‌). రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. విడుదల చేశారు. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు నిర్మాత. తన ఫస్ట్ సినిమా ‘నానుమ్ రౌడీదాన్’ పేరు కలిసొచ్చేలా రౌడీ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ రూపొందించి విఘ్నేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ నటించిన ‘గృహం’ చిత్రంతో అందరి మన్ననలు పొందిన మిలింద్‌ రౌ దర్శకత్వం వహిస్తున్నారు.

Netrikann ఈ ఫస్ట్ లుక్‌లో చేతిలో రెంచి పట్టుకుని ఉన్న నయనతారను చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమని అర్ధమవుతోంది. చుట్టూ గాజుముక్కలు, బ్యాగ్రౌండ్‌లో షాడో కూడా కనిపిస్తున్నాయి. టైటిల్ ఫాంట్ బ్రెయిలీ లిపిలో డిజైన్ చేయడంతో నయనతార ఈ చిత్రంలో అంధురాలిగా కనిపించనుందనే విషయం రివీల్ అయింది. ఇంతకుముందు ‘వసంతకాలం’ మూవీలో బధిర (వినికిడి మరియు మాట్లాడలేని) పాత్రలో ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ లో అంధురాలి వంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏ స్థాయిలో చేస్తుందో కొత్తగా చెప్పక్కర్లేదు.అలాగే నయన్ నటించిన మరో చిత్రం Mookuthi Amman – (మూకుత్తి అమ్మన్). తొలిసారి అమ్మవారి పాత్రలో నయనతార నటించింది. కోలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బాలాజీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.Mookuthi Amman

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *