లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేదా? : బ్యాంకులు వదలవు.. మీ అకౌంట్లో గీకేస్తాయి.. జాగ్రత్త!

బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చాయి కదా? అని ఎలా పడితే అలా గీకేస్తున్నారా? క్రెడిట్ కార్డుల్లో లిమిట్ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు ఇక.

Published

on

NCDRC Order : Not paid Credit Card dues? HDFC Bank can withdraw from your savings account 

బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చాయి కదా? అని ఎలా పడితే అలా గీకేస్తున్నారా? క్రెడిట్ కార్డుల్లో లిమిట్ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు ఇక.

బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చాయి కదా? అని ఎలా పడితే అలా గీకేస్తున్నారా? క్రెడిట్ కార్డుల్లో లిమిట్ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు ఇక. మీరు ఎక్కడికి వెళ్లినా బ్యాంకులు గాలం వేసి పట్టుకుంటాయి. మిమ్మల్ని కాదు.. కట్టాల్సిన బిల్లుల తాలూక మొండి బకాయిలను ముక్కు పిండి మరి వసూలు చేసుకుంటాయి. చాలామంది క్రెడిట్ కార్డుదారులు కార్డుల్లో నగదును ఎడాపెడా గీకేస్తుంటారు. క్రెడిట్ బిల్లు తడిసి మోపెడు అయినా పట్టించుకోరు. డ్యు డేట్ సమయానికి క్రెడిట్ బిల్లులు చెల్లించరు. కొంతమంది క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఎగ్గొట్టేస్తారు. మరికొంతమంది మినిమం డ్యూ మాత్రమే కట్టేస్తూ కాలం నెట్టుకుస్తుంటారు.

గడువు తేదీ లోపు బిల్లు చెల్లించపోయినా, గడువు దాటాక బిల్లు ఆలస్యంగా చెల్లించినా భారీ వడ్డీలను బ్యాంకులు వడ్డీస్తాయి. అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అయినా కొందరు అలానే బిల్లులు చెల్లించకుండా నెట్టుకొస్తుంటారు. ఇలాంటి మొండి క్రెడిట్ బకాయిలపై బ్యాంకులు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు బిల్లులు చెల్లించని కస్టమర్లకు దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులు ఎగ్గొట్టిన కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ల నుంచి బ్యాంకులు విత్ డ్రా చేస్తున్నాయి. కస్టమర్లకు ముందుస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వవు. మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు.. వెంటనే బకాయిల కింద ఏ సమయంలోనైనా ఖాతాలో డబ్బులు లాగేసుకుంటాయి జాగ్రత్త.

క్రెడిట్ బిల్లులు చెల్లించలేదని:
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు HDFC ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. నేషనల్ కంజ్యూమర్ డిస్ ప్యూటెడ్ రీడ్రెసల్ కమిషన్ (NCDRC) న్యూఢిల్లీ ఆదేశాలనుసరం HDFC బ్యాంకు ఈ రూల్స్ పాటిస్తోంది. అనీష్ ముంజల్ అనే వ్యక్తి సేవింగ్స్ అకౌంటు.. సెంచూరియన్ బ్యాంకు ఆఫ్ పంజాబ్ లో ఉంది. ఈ బ్యాంకు 2008 మేలో HDFCలో విలీనమైంది.

కస్టమర్ ముంజల్ కు ఇదే బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్ చేసింది. కొన్నాళ్లుగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం మానేశాడు. దీంతో అతడి క్రెడిట్ బిల్లు వడ్డీలు, పెనాల్టీలతో కలిపి రూ.53వేల, 043.68కు చేరింది. దీంతో HDFC బ్యాంకు అతడి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ నుంచి తమ క్రెడిట్ బిల్లులను వసూలు చేసింది. ఈ మొత్తాన్ని అతడి ఖాతా నుంచి ఎలాంటి సమాచారం లేకుండా బ్యాంకు విత్ డ్రా చేసింది. దీనిపై కస్టమర్ జిల్లా ఫారంను సంప్రదించాడు.

ఇక్కడ ముంజాల్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎగ్గొట్టాడని, అందుకే అతడి సేవింగ్స్ అకౌంట్ నుంచి బకాయిలను వసూలు చేసినట్టు బ్యాంకు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ డిస్ట్రిక్ ఫారమ్ బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. దీంతో సదరు బ్యాంకు.. జిల్లా ఫారంకు వ్యతిరేకంగా స్టేట్ కమిషన్ ఆశ్రయించింది. ఇక్కడ కూడా HDFC బ్యాంకుకు చుక్కెదురు అయింది.. కస్టమర్ కే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక చేసేది ఏమిలేక బ్యాంకు చివరిగా NCDRCను సంప్రదించింది.

ముంజాల్ ఫిర్యాదులో ఏమన్నాడంటే? :
HDFC బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నానని, ఆ తర్వాత చివరిసారిగా డిసెంబర్ 2005 వరకు కార్డు వాడినట్టు చెప్పాడు. ఆ తర్వాత బ్యాంకు డిమాండ్ ప్రకారం.. క్రెడిట్ బకాయిలను చెల్లించి కార్డును కూడా రద్దు చేసుకున్నట్టు తన ఫిర్యాదులో వెల్లడించాడు. దీనిపై బ్యాంకు స్పందిస్తూ.. అతడి క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ డిసెంబర్ 5, 2004 నాటికి రూ.9979.75 (పెనాల్టీలు, వడ్డీతో కలిపి)గా ఉందని పేర్కొంది.

అతడు ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో.. లేటు ఫీజు, ఓవర్ లిమిట్ ఫీజులు, పెనాల్టీలను పెంచుతూ వెళ్లినట్టు బ్యాంకు స్పష్టం చేసింది. అలా చెల్లించాల్సిన మొత్తం రూ.53,043.68లకు చేరింది. అందుకే ముంజాల్ సేవింగ్స్ ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని రూ.53వేల, 043.68కు విత్ డ్రా చేసినట్టు బ్యాంకు తెలిపింది.

NCDRC రూల్ ఏం చెబుతోంది:
క్లాజ్-6, NCDRC నియమ నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు.. కార్డుపై బకాయిలను కార్డు దారుడి సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎలాంటి నోటీసు లేకుండానే ఏ క్షణంలోనైనా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈ క్లాజ్ దృష్ట్యా పిటిషనర్ బ్యాంకు తమ క్రెడిట్ కార్డు బకాయిలను ఏ సమయంలోనైనా తిరిగి రాబట్టుకోవచ్చు.
ఫిర్యాదుదారుడికి ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.53,043.68 విత్ డ్రా చేయడం జరిగింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *