kumbhamela app

కుంభమేళాకోసం కొత్త యాప్ రిలీజ్ చేసిన రైల్వే 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కుంభమేళా వివరాలతో యాప్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ

లక్నో: జనవరి 15 నుంచి ప్రయాగరాజ్  లో జరగనున్న కుంభమేళాలో యాత్రికుల సౌకర్యం కోసం నార్త్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా యాప్ ను విడుదలచేసింది. “రైల్ కుంభ సేవా మొబైల్ యాప్ ”  పేరుతో ఉన్న ఈ యాప్ లో కుంభమేళాకు వచ్చే  యాత్రికులు, భక్తులు ఇతర ప్రయాణికుల కోసం అవసరమైన సమచారాన్ని పొందుపరిచినట్లు ఎన్‌సీఆర్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ మాల్వియ చెప్పారు. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకరైళ్ల సమాచారం, రిజర్వేషన్ వివరాలు ప్రయాణికులు పొందవచ్చని ఆయన అన్నారు. 
దేశంలోని ఏప్రాతంనుంచి, ఏ సమయంలోనైనా  కుంభమేళాకు సంబంధించిన పూర్తి  సమాచారాన్ని యాత్రికులు తెలుసుకోవచ్చన్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులు  ప్రయాగ్ రాజ్ లోని  అన్నిరైల్వే స్టేషన్ల వివరాలు, హోటళ్లు,బస్ స్టేషన్లు, వసతి వివరాలు, కుంభమేళా జరిగే ప్రాంతంలో ఏమేమి  ఇతర సౌకర్యాలు ఉన్నాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.  యాత్రికుల సౌకర్యం కోసం  పార్కింగ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, డార్మిటరీలు, వెయిటింగ్ హాళ్ల  వివరాలను కూడా ఈ యాప్ లో పొందుపరిచారు.
 

Related Posts