Home » 10 కోట్ల మంది చైనీయులకు విషపూరిత తాగునీరు పంపిణీ
Published
1 month agoon
toxic chemicals drinking water supplied to Chinese people : చైనాలో దాదాపు 100 మిలియన్ల (10కోట్ల) మందికి విషపూరిత రసాయనాలు కలిగిన తాగునీరు సరఫరా అయింది. తాగునీరులో సురక్షితమైన పరిమితులకు మించి విష రసాయనాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. సింఘువా యూనివర్శిటీ నుంచి వచ్చిన పరిశోధక బృందం తాగునీటిలో కలిసిన polyfluoroalkyls (PFAS) కెమికల్ స్థాయిలను పర్యవేక్షించింది. గతంలో అధ్యయనాల డేటా ఆధారంగా పరిశోధక బృందం విశ్లేషించింది.
బట్టలు, పురుగుమందులలో ఉపయోగించే మానవనిర్మిత రసాయనాలు పర్- పాలీఫ్లోరోఅల్కైల్స్ స్థాయిలు పరిమితికి మించి ఉన్నాయని బృందం గుర్తించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అధ్యయనం చేసిన చైనా నగరాల్లో 20 శాతానికి పైగాPFAS రసాయనాలు తాగునీటిలో సురక్షిత స్థాయిలను మించి ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. 20 శాతానికి పైగా పిఎఫ్ఎఎస్ సాంద్రత ఉండగా, మొత్తం 16 నగరాల్లో సురక్షిత స్థాయిలను మించి ఉన్నట్టు గుర్తించారు. అధ్యయనం ప్రకారం.. తూర్పు చైనాలోని వుక్సీ, హాంగ్జౌ, సుజౌ, దక్షిణ ప్రావిన్స్ గువాంగ్డాంగ్లోని ఫోషన్ వంటి నగరాలు ఉన్నాయి.
పిఎఫ్ఎఎస్ల సగటు సాంద్రత ఉత్తరాన కంటే 2.6 రెట్లు ఎక్కువ. కొన్ని PFAS రసాయనాలు ప్రమాదకరమైనవిగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా PFOA, PFOS అనే రసాయనాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఈ రెండు విష రసాయనాలు మానవ శరీరంలో లేదా వాతావరణంలో విచ్ఛిన్నం కావని, కాలక్రమేణా పేరుకుపోతాయని యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. విషపూరితమైన PFOS రసాయనాల తాగునీటి వాడకాన్ని నివారించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.