NEET, JEE Main 2020 : అరగంట ముందే పరీక్ష సెంటర్ గేట్లు క్లోజ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. పరీక్ష సమయం అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని అధికారులు వెల్లడించారు.గేట్లు మూసివేసిన అనంతరం నిమిషం ఆలస్యమైనా అనుమతిం చేది లేదని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. విద్యార్థులను ఉదయం 7:20 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని, 8:30 గంటలకు గేట్లు మూసివేస్తామని తెలిపారు. మధ్యాహ్నం పరీక్షకూ ఇదే విధానం అమలు చేస్తామన్నారు.

ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పలు నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలన్నారు.పాటించాల్సిన నియమాలు :
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్‌–19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌ (అండర్‌ టేకింగ్‌)లో వివరాలు నమోదు చేయాలి.
ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర వేయాలి.
14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవంటూ నమోదు చేయాలి.

skydrive, ఎగిరే కారు రెడీ..టెస్ట్ డ్రైవ్ సక్సెస్


వాటర్‌ బాటిల్, బాల్‌పెన్, 50ఎంఎల్‌ శానిటజర్‌ బాటిల్‌లకు అనుమతి.
అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద ఇచ్చే మాస్క్ నే ధరించాలి.
బీఆర్క్‌ అభ్యర్థులు డ్రాయింగ్‌ టెస్ట్‌ కోసం జామెట్రీ బాక్స్‌ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్‌ పెన్సిల్స్‌ లేదా క్రేయాన్స్‌ తెచ్చుకోవచ్చు.
రఫ్‌ వర్క్‌ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్‌ తెల్ల కాగితాలు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు తమ వెంట హాల్‌ టికెట్‌తోపాటు నిబంధనల్లో పేర్కొన్న ఏదేనీ గుర్తింపు కార్డు, పాస్‌ పోర్టు సైజు ఫొటో చూపించాలి.
ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు చూపించాలి.రెండు విడతల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌)లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ను నిర్వహించనుంది. 2 నుంచి 6వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశాలకు పది విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

Related Posts