Nellore police have arrested a person who is engaged in non-violent activities

షార్ట్ ఫిలింస్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేయండి… ఆ తరువాత డైరెక్టుగా సినిమాల్లోనే యాక్టింగ్ అవకాశం నేను కల్పిస్తాను…అంటూ పలువురు మైనర్ బాలికలను, యువతులను ట్రాప్ చేశాడు నెల్లూరులో ఓ ఘరానా మోసగాడు. అసలే సినిమా మోజు ఎక్కువగా ఉన్న నెల్లూరులో అనేక మంది బాలికలు, యువతులు ఆమాటలు నమ్మి మోసగాడి వలలో పడిపోయారు. ఇంకేముంది.. మాయమాటలతో నమ్మబలికి వారిని లోబర్చుకుని శారీరకంగా అనుభవించడ౦..ఆ దృశ్యాలను రహస్యంగా సెల్ ఫోన్లలో చిత్రీకరించడం.. ఆతర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార రొంపిలోకి దించడం..ఇది  ఒక బిజినెస్ గా మార్చేసుకున్నాడు ఆ కేటుగాడు. 
అంతేకాదు ఏదో గౌరవమైన వ్యాపారం చేస్తున్నట్లు నెల్లూరులోని పలుచోట్ల వ్యభిచార కేంద్రాలను కూడా తెరిచేసాడు. ఎట్టకేలకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతనితో పాటూ వ్యభిచార గృహాలను నడుపుతున్న నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. 

నెల్లూరు జ్యోతినగర్ కు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ అలియాస్ మహేష్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిమ్స్ పేరుతో అనేక మంది అమ్మాయిలకు వల వేశాడు.” నెల్లూరు స్టార్ట్ గన్ ” అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానని ఆ షార్ట్ ఫిలిమ్స్ లో ప్రతిభ చూపితే సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని అనేక మంది అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. వెండి తెరపై వెలిగిపోవాలన్న ఆశతో అనేక మంది అతని ఉచ్చులో ఇరుక్కు పోయారు. సినిమా అవకాశాలు కావాలంటే తన కోరిక తీర్చాలని బలవంత పెట్టేవాడు. సినిమా ఆశ మోజులో అనేక మంది అతని కోరికలకు బలయ్యారు. కొందరు మైనర్ బాలికలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అమ్మాయిలతో గడిపే సమయాల్లో ఆ దృశ్యాలను రహస్యంగా సెల్ ఫోన్లలో చిత్రీకరించేవాడు. తరువాత ఆ దృశ్యాలను చూపించి వ్యభిచారం చేయాలని లేదంటే న్యూడ్ వీడియోస్ ను ఇంటర్నెట్, యూ ట్యూబ్ లో పెడతానని బెదిరించే వాడు. దీంతో వారు వ్యభిచారం చేసేందుకు అంగీకరించేవారు. ఇలా చాలాకాలంగా ఈమోసగాడి చేతిలో బలైన అనేక మంది బాధితుల చేత బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ వ్యభిచారం చేయిస్తూ వస్తున్నాడు జాకీర్ హుసేన్.  అంతేకాక ఇతర జిల్లాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచార వ్యాపారాన్ని సాగించేవాడు. గతంలోనూ ఈ కేటుగాడు ఇలాంటి పనులకే పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అయినా కష్టపడకుండానే డబ్బులు వస్తుండటంతో తనలో ఏమాత్రం మార్పురాలేదు. 

ఈ కేటుగాడు ఏదో పెద్ద వ్యాపారం చేస్తున్న వాడిలా..ఎవరైతే వీడి చేతిలో బాధితులుగా ఉన్నారో వారిని ఆధారంగా చేసుకుని నెల్లూరు నగరంలోని 6 చోట్ల వ్యభిచార గృహాలను ఏర్పాటు చేశాడు. వీటికి నిర్వాహకులను కూడా పెట్టుకున్నాడు. ఈ బ్రోతల్ వ్యాపారంతో వచ్చే సంపాదనతో ఈ మోసగాడు బాగా ఎంజాయ్ చేస్తూ సంపాదనలో సగం ఇతగాడు తీసుకోవడం ..మిగిలిన సగంలో కొంత నిర్వాహకులకు, కొంత వ్యభిచారం చేస్తున్న బాధితులకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉన్న కోవూరుకు చెందిన ఓ మైనర్ బాలికను వ్యభిచారం చేయాలని బలవంతం చేయగా ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు వ్యభిచార గృహాల చిరునామాలు సేకరించి ఏకకాలం లో దాడులు నిర్వహించారు.

READ  మతసామరస్యానికి ప్రతీక : ప్రారంభమైన రొట్టెల పండుగ

ఈ దాడుల్లో ప్రధాన ముద్దాయి షేక్ జాకీర్ హుస్సేన్ తో పాటూ వ్యభిచార గృహాలు నడుపుతున్న నిర్వాహకులు, మహిళలను, విటులను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్, శ్రావణి ,శ్రీనివాసులు,  విరాట్ నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న షేక్ నూరి, కోటమిట్టలో వ్యభిచార గృహం నడుపుతున్న సుమ, స్టోన్ హౌస్ పేటలో వ్యభిచార గృహం నడుపుతున్న  శ్రీలక్ష్మి, మల్లీశ్వరి, పోస్టల్ కాలనీలో వ్యభిచారం గృహం నడుపుతున్న లక్ష్మి, హారిక,  వేదాయపాళెంలో నిర్వహిస్తున్న శ్రీనివాసరావు, వనంతోపు సెంటర్ లో నిర్వహిస్తున్న సునీత, చిల్డ్రన్స్ పార్క్ వద్ద రాంజీనగర్ లో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిలను అరెస్ట్ చేశారు. వారితో పాటూ 5 గురు విటులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాగే ఈ మాయగాడి చేతిలో బలైన 7 మంది బాధితులను రెస్క్యూ హోంకు తరలించారు. అతగాడి బూతు పురాణమంతా నిర్లిప్తమై ఉన్న హార్డ్ డిస్క్ తో పాటూ  కంప్యూటర్ ను, కారు, బైక్, సెల్ పోన్లను విచారణ కోసం పోలీసులు సీజ్ చేశారు.

Related Posts